వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలోకి భారీ చేరికలు

అమరావతి: టీడీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు వైయస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వైవీ సుబ్బారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎనికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైఎస్‌ జగగన్‌ ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. అదే విధంగా పార్టీలో చేరిన ముఖ్యులు మాట్లాడుతూ.. సీఎం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులమై వైయస్‌ఆర్‌ సీపీలో చేరామన్నారు. జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో కలిసి నడుస్తామన్నారు.

Read Also: ఏపీ క్రిమినల్‌ లా చట్టం(సవరణ) 2019కి కేబినెట్‌ ఆమోదం 

తాజా ఫోటోలు

Back to Top