ఏపీ క్రిమినల్‌ లా చట్టం(సవరణ) 2019కి కేబినెట్‌ ఆమోదం 

అమరావతి: మహిళలకు అండగా చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ క్రిమినల్‌ లా చట్టం(సవరణ) 2019కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అత్యాచార కేసుల్లో వారం రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయాలని, అత్యాచార కేసుల్లో 21 రోజుల్లోనే తీర్పు వెలుబడనుంది. అత్యాచార కేసులకు సంబంధించి ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక కోర్టు పరిధిలో యాసిడ్‌ దాడులు, అత్యాచారం కేసులు, సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు ఉంటాయి. మొదటిసారి తప్పుడు పోస్టుకు రెండేళ్లు జైలు శిక్ష, రెండోసారి తప్పుడు పోస్టింగ్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష ఉంటుంది. చిన్నారులను లైంగికంగా వేధిస్తే ఏడేల్ల వరకు జైలు శిక్ష ఉంటుంది.
 

Read Also: వైయస్‌ జగన్‌ గ్రామ రాజ్య పాలన..మరో రామరాజ్య పాలన

తాజా ఫోటోలు

Back to Top