మంత్రుల కార్లపై క‌ర్ర‌లు, రాళ్ల‌తో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల దాడి

విశాఖ: విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన ర్యాలీ, బహిరంగ సభను ముగించుకొని ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న టీటీడీ చైర్మ‌న్‌, వైయ‌స్ఆర్ సీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు క‌ర్ర‌లు, రాళ్లతో దాడికి తెగబడ్డారు, ఈ దాడిలో మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అదే విధంగా మంత్రి రోజా సహాయకుడికి గాయాలయ్యాయి. తనపై దాడి జరిగిందని,  జనసేన కార్యకర్తల దాడిలో తమ వాళ్లకు గాయాలయ్యాయని మంత్రి జోగి రమేష్‌ చెప్పారు. క‌ర్ర‌లు, రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడికి దిగారన్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఇది క‌రెక్ట్ కాద‌న్నారు.

Back to Top