జగనన్నా..మీరే నాకు ఇన్‌స్పిరేషన్‌

దెందలూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
 

ఏలూరు జిల్లా: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తనకు ఇన్‌స్పిరేషన్‌ అని వైయస్‌ఆర్‌సీపీ దెందలూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. వైయస్‌ఆర్‌ ఆసరా మూడో విడత కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..నేను పుట్టిన ఈ గడ్డకు ..ఈ ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం వైయస్‌ జగన్‌ను నా నమస్కారాలు..
అన్నా..మీరే నాకు ఇన్‌స్పిరేషన్‌..మన జెండా పట్టుకొని పోరాటం చేస్తున్నప్పుడు..యువతరం రాజకీయాల్లోకి రావాలన్న మీ పిలుపుతో మీ నాయకత్వంలో, మీ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చాను. ఈ నియోజకవర్గాన్ని వైయస్‌ఆర్‌సీపీ కంచుకోటగా మార్చుతాం. ఈ దెందలూరులో ఎప్పుడూ వినిపించేది వైయస్‌ జగన్‌ పేరు మాత్రమే. ఎగిరేది వైయస్‌ఆర్‌సీపీ జెండా మాత్రమే.గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇక్కడికి వచ్చి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి  మోసం చేశారు. ఏ గ్రేడ్‌ గ్రూప్‌లను డీ గ్రూప్‌నకు నెట్టారు. వైయస్‌ జగన్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నాలుగు విడతల్లో రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికే మూడు విడతలు ఇస్తున్నారు. సున్నా వడ్డీ పథకాన్ని మళ్లీ పునఃప్రారంభించి డ్వాక్రా మహిళల్లో చిరునవ్వులు తెప్పించారు. వైయస్‌ జగన్‌ పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగుతోంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో రూ.1900 కోట్ల సంక్షేమం, అభివృద్ధి జరిగింది. ఈ రోజు ఈ నియోజకవర్గం వచ్చి వైయస్‌ఆర్‌ ఆసరా మూడో విడత ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ నియోజకవర్గంలో మీరు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎంతో మంది రైతులు మిమ్మల్ని కలిశారు. మాకు ఎత్తిపోతల పథకం కావాలని కోరితే..ఈ రోజు మీరే ఇక్కడికి వచ్చి లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు రూ.85 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఇక్కడ తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు 32 రెండు గ్రామాలకు మంచినీరు ఇచ్చే అవకాశం కల్పించారు. తమ్మిలేరు వంతెనకు ఇవాళ పునాది వేసినందుకు ఆనందంగా ఉంది. ఈ గ్రామంలో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. అలాగే ఒక పీహెచ్‌సీని కూడా ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీలు ఎక్కువగా ఉన్నారు. ఈ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించారు. ఎస్సీ కాలనీల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి. వంతెనలు చాలా అవసరం ఉంది. వీరంపాలెం బ్రిడ్జిని నిర్మించాలి. ఒకే చోట వరి, ఆక్వా, పామాయిల్, కోకో పంటలు ఇక్కడ పండుతున్నాయి. మా నియోజకవర్గంలో 150 స్కూళ్లలో నాడు–నేడు పనులు చేపట్టారు. ఇటీవల రెండు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేశారు. కోల్లెరు ప్రాంతంలో జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయాలి. దెందలూరు నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ను ఎమ్మెల్యే కోరారు. మన ప్రభుత్వంపై దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడదామని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పిలుపునిచ్చారు. 

 

Back to Top