ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు తీర‌ని లోటు

ఐటీ స్పెషల్‌ సెక్రటరీ వరవన్‌

నెల్లూరు: గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పరిశ్రమల శాఖకు తీరని లోటని ఐటీ స్పెషల్‌ సెక్రటరీ వరవన్‌ అన్నారు. ఆయ‌న లేర‌న్న నిజాన్ని న‌మ్మ‌లేక‌పోతున్నామ‌ని పేర్కొన్నారు. నెల్లూరులోని మేక‌పాటి క్యాంపు కార్యాల‌యంలో గౌత‌మ్ రెడ్డి భౌతిక‌కాయానికి వ‌ర‌వ‌న్ నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..దుబాయ్‌ ఎక్స్‌పోలో గౌతమ్‌రెడ్డి ప్రజెంటేషన్‌ అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుందని.. రూ.5 వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామన్నారు. దుబాయ్‌ పారిశ్రామిక వేత్తలు సైతం ఆయన లేరన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారని వరవన్‌ అన్నారు.

Back to Top