సీఎం దార్శనికతతో పారిశ్రామికంగా రాష్ట్రం ముందడుగు

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 చారిత్రాత్మక విజయం సాధించింది

పారిశ్రామిక వేత్తల అంచనాలకు తగినట్టుగా ప్రభుత్వ సహకారం

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికతతో ఆంధ్రరాష్ట్ర పారిశ్రామికంగా ముందడుగు వేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాటల మనిషి కాదు.. చేతల మనిషి అని, పబ్లిసిటీకి దూరంగా ఉంటారన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు. వివిధ దేశాల నుంచి ప్రసిద్ధ సంస్థలు సమ్మిట్‌కు హాజరయ్యాయని, 2 రోజుల సదస్సులో విలువైన చర్చలు జరిగాయని చెప్పారు. పారిశ్రామిక వేత్తల అంచనాలకు తగినట్టుగా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. రెండోరోజు మొదలైన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడారు.. 

ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ వ్యాపారవేత్తలు నేడు విశాఖ సమ్మిట్‌కు హాజరయ్యారంటే..  అందుకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయతే కారణమన్నారు.  పెట్టుబడుల ఒప్పందాలు, నిర్మాణాత్మక సంస్కరణలపై నిర్ణయాలతో ఈ సదస్సు విజయవంతంగా పూర్తి అవుతోందన్నారు. 

``ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ రంగాల్లో సమృద్ధిగా పెట్టుబడి అవకాశాలను, ఆ పెట్టుబడులకు సరైన విలువలను, ఫలితాలను అందించగలదు. రాష్ట్రంలో పుష్కలంగా ఉన్న మౌలికవసతులు ఉత్తర అమెరికా, యూరొప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికన్ ప్రాతినిధ్య సంస్థలెన్నిటినో ఇక్కడకు ఆకర్షించాయి. వ్యాపార, వాణిజ్యరంగాల్లో ఏపీకి అంతర్జాతీయంగా ఉన్న సత్సంబంధాలకు ఈ సమ్మిట్ ఒక ప్రత్యక్ష నిదర్శనం. భారీ పెట్టుబడులకు రాచబాట వేస్తూనే, మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే, ఉద్యోగితను కల్పించే MSME లకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. సమృద్ధిగా ఉన్న వనరులను, ప్రతిభను, మౌలికవసతులను వినియోగించుకుంటూ నిర్దేశిత లక్ష్యాలను, అంచనాలను అందుకునే దిశగా ఈ రాష్ట్రం అడుగులు వేస్తోంది. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమర్థ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థలో కీలకభాగస్వామిగా మారేందుకు ఏపీ పోటీపడుతోంది.``

Back to Top