ర‌మ్య కేసులో చారిత్రాత్మ‌క తీర్పును స్వాగ‌తిస్తున్నా..

తాడేప‌ల్లి: గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్‌ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మ‌క తీర్పును స్వాగ‌తిస్తున్నాన‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. కోర్టు తీర్పు వెలువ‌డిన అనంత‌రం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు`` తెలుపుతూ ఈ మేర‌కు సీఎం ట్వీట్ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top