విజయవాడ: అధికారానికి దూరమైతే క్షణం కూడా అగలేనన్నట్టుగా చంద్రబాబు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని హోం మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. గౌరవ సీఎం వైయస్ జగన్ గారు రెండున్నరేళ్ల కాలంలోనే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ, ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చూసి ప్రజలందరూ ఏ ఎన్నికలు వచ్చినా.. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో.. ఇలా అన్ని ఎన్నికల్లోనూ వైయస్ఆర్ సీపీకి అండగా ఉంటూ, జగన్ గారి పాలనకు మద్దతుగా నిలబడుతున్నారని చెప్పారు. కానీ, సీఎం గారిని టీడీపీ నేతలు అనరాని మాటలు అంటూ దూషిస్తూ.. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, తన ఐదేళ్ల పరిపాలనలో ప్రజారంజకంగా పాలన చేస్తే.. టీడీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. స్వయంగా తన నియోజకవర్గంలోనే ఎందుకు ఓడిపోయానా? అని చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. - చంద్రబాబు 2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఉన్న పరిస్థితిలో ప్రజల చేత తిరస్కరించబడ్డారు, ఈరోజు అధికారానికి దూరమైతే క్షణం కూడా ఉండలేనని చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు ప్రేలాపనలు చేస్తున్నారు.. - చంద్రబాబుని ఆయన కుటుంబసభ్యులు ఒక్కసారి హస్పటల్ లో చూపించాలి. ఎందుకంటే, అధికారానికి దూరం అయినప్పుడల్లా "నేను మారిపోయనని" ప్రజల దగ్గరకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడతారు.. - చంద్రబాబు ఏనాడైనా, ప్రజలు ఎందుకు తిరస్కరించారని పోస్ట్ మార్టం చేసుకున్నారా? అలా చేసుకోకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న జగన్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మొన్న కూడా జగన్ గారు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించినప్పుడు గాలిలో వస్తాడు.. గాలిలో పోతాడని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.. - చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది పోయి.. తిట్ల పురాణం చేయడం ఏంటి..? - ప్రజా రాజధాని అంటే అన్ని రకాల ప్రజలకు అక్కడ నివాసయోగ్యంగా ఉండాలి. కానీ, సామాన్యుడు వెళ్ళి నివసించడానికి కానీ, ఇల్లు కట్టుకునే పరిస్థితి కానీ అమరావతిలో ఉందా? అంటే లేని పరిస్థితి - అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వబోతుంటే డెమోగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్ వస్తుందని, పేదలు ఉండడానికి వీల్లేదని అడ్డుకునే పరిస్థితి. - జస్టిస్ చంద్రు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీద, న్యాయవ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో.. ప్రజలు మద్దతిచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద కోర్టులు ఏ విధంగా జోక్యం చేసుకుంటున్నాయి.. ఇది కరెక్టా? అని మాట్లాడితే.. రిటైర్డ్ జడ్జితో మేమేదో మాట్లాడిస్తున్నామని విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టు..? - వరుసగా ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు ఎందుకు ఓడిపోతున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సుచరిత సూచించారు.