మహిళా సంక్షేమానికి పెద్దపీట

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనలో మహిళాలోకమంతా సంతోషంగా ఉందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రతి సంక్షేమ పథకంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. గుంటూరులో హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కట్టుబడి ఉంటారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా డ్వాక్రా మహిళల కోసం రూ. 14 వందల కోట్లు విడుదల చేసి వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు చేయలేని పని సీఎం వైయస్‌ జగన్‌ చేసి చూపిస్తున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజల అదృష్టమన్నారు. 

తాజా వీడియోలు

Back to Top