పోలీసులు త్యాగానికి నిలువుటద్దం

హోం మంత్రి సుచరిత
 

విజయవాడ:  పోలీసులు త్యాగానికి నిలువుటద్దం అని.. వారి త్యాగాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. శాంతి భద్రతలు పర్యవేక్షించే హోం మంత్రిగా తనకు సీఎం జగన్‌ అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారీగా ఉద్యోగాలు కల్పించి పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బాలికలు, మహిళ సంరక్షణ కోసం మహిళ మిత్ర ఏర్పాటు చేశామని వెల్లడించారు.  

Read Also: పోలీసు అమరవీరులకు సెల్యూట్‌ 

తాజా ఫోటోలు

Back to Top