ప్ర‌జ‌లకు పోలీసుల ప‌ట్ల విశ్వాసం పెంచుతాం..

మ‌హిళ‌ల‌పై నేరాల‌ను అరిక‌డ‌తాం

గ్రామాల్లో ప్ర‌జాద‌ర్బార్

పోలీస్‌శాఖ‌లో ఖాళీలు భ‌ర్తీ చేస్తాం

హోంమంత్రి మేక‌తోటి సుచ‌రిత‌

అమరావతి:బడుగు,బలహీనవర్గాలు,మైనార్టీలు,సాధారణ పౌరులకు పోలీసుల పట్ల విశ్వాసం పెంచడానికి గ్రామాల్లో ప్రజాదర్బార్ నిర్వ‌హిస్తామ‌ని హోంమంత్రి మేక‌తోటి సుచ‌రిత అన్నారు..సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఆమె మాట్లాడారు.మహిళలపై నేరాలను అరికడతామ‌న్నారు. పారదర్శకత, నిష్ఫ‌ క్షపాతం,ఖచ్చితమైన పరిశోధన, బాధితుల‌కు త్వరిత‌గతిన న్యాయం చేయ‌డం మొదటి ప్రాధాన్యాంశాలన్ని తెలిపారు.  బడుగు,బలహీనవర్గాలు,మైనార్టీలు,సాధారణ పౌరులకు పోలీసుల పట్ల విశ్వాసం పెంచడానికి గ్రామాల్లో ప్రజాదర్బార్,ఇతర అవగాహన సదస్సులను పోలీసు శాఖ నిర్వహిస్తుందన్నారు..వాహనదారులకు నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తామ‌ని తెలిపారు.విధి నిర్వహణలో ఒత్తిడి లేకుండా పోలీసులకు వీక్లి ఆఫ్‌ కల్పించామని తెలిపారు.నిరుద్యోగ సమస్యలను తగ్గించేందుకు పోలీస్‌శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ స‌మావేశంలో  పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఐపీఎస్‌ అధికారులు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top