రాజధాని అంశంపై రాష్ట్రాలదే తుది నిర్ణయం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌
 

ఢిల్లీ: రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది. రాజధాని విషయంలో లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రశ్నకు హోంశాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఎక్కడ రాజధాని పెట్టుకోవాలన్నది రాష్ట్రం పరిధిలోని అంశమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ అన్నారు. శాసన మండలి, రాజధాని అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వం ఉంది. రాజకీయ అంశాల్లో కేంద్రం చేసేదేమీ ఉండదు. అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాజధాని అంశంలో ఆయా కమిటీల సూచనల మేరకు  రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. ఈ అంశంపై అసెంబ్లీలో బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. 

తాజా వీడియోలు

Back to Top