టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖకు ఏం చేశారు..?

చంద్రబాబు, లోకేష్‌కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రశ్న..

విశాఖపట్నం: తెలుగుదేశం హయాంలో వైద్య ఆరోగ్య శాఖకు ఏం చేశారో సమాధానం చెప్పాలని మంత్రి విడదల రజిని డిమాండ్‌ చేశారు. అధికారంలో ఉండగా ప్రజలను, రాష్ట్రాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు, లోకేష్‌ ఏ మొహం పెట్టుకొని మళ్లీ ప్రజల మధ్య తిరుగుతున్నారని ప్రశ్నించారు. విశాఖలో మంత్రి విడదల రజిని మీడియాతో మాట్లాడారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు అత్యధిక ప్రాధాన్యమిచ్చిందని, అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. పేదవాడికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయమని∙అన్నారు. ఆ దిశగానే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తుంద‌న్నారు.
 

Back to Top