ప్రపంచ చెస్‌ ఛాంపియన్ దొమ్మ‌రాజు గుకేశ్‌కు వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

తాడేప‌ల్లి: వరల్డ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. 14వ గేమ్‌లో గుకేశ్‌ ప్రస్తుత ఛాంపియన్‌, చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌ను ఓడించాడు. గుకేశ్‌ 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌ను వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు.  ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా గుకేశ్ దొమ్మ‌రాజు రికార్డు నెలకొల్ప‌డం ప‌ట్ల తెలుగు జాతి గ‌ర్విస్తోంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. మ‌రెన్నో విజ‌యాలు సొంతం చేసుకొని తెలుగు నేల కీర్తిని ప్ర‌పంచానికి చాటాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షిస్తూ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

Back to Top