విశిష్ట నాయ‌కత్వ రీతికి చిరునామా వైయ‌స్ జ‌గ‌న్

రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

ఘనంగా సీఎం వైయ‌స్‌ జగన్ జన్మదిన వేడుకలు

శ్రీ‌కాకుళం: విశిష్ట నాయ‌కత్వ రీతికి చిరునామా యువ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. ముఖ్య‌మంత్రి జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని స్థానిక టౌన్ హాల్ లో రెడ్ క్రాస్ స‌మ‌న్వయంతో ఏర్పాటు చేసిన ర‌క్త‌దాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్ర‌జల జీవ‌న ప్ర‌మాణాల‌ను పెంపుద‌ల చేసేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని అన్నారు. ప్ర‌జా జీవితంలో ఎవరు బాగా ప‌నిచేస్తే వారే చిర స్థాయిలో కీర్తిని పొంది, జ‌న హృద‌యాల్లో నిలిచిపోతారని, ఆవిధంగా తండ్రి మాదిరిగానే వైయ‌స్ జ‌గ‌న్ కూడా చిర కీర్తిని అందుకుంటార‌ని అన్నారు. ప్ర‌జాశ్రేయ‌స్సు కోరి ప‌నిచేసే వైయ‌స్ జ‌గ‌న్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ముఖ్యమంత్రి జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. కారణం ప్రజలందరి జీవన ప్రమాణాలు పెంచాలని, సమాజంలో ఉన్న అసమానతలు తొలగించాలని ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో సీఎం కృషి చేశారని అన్నారు.
అనంత‌రం శ్రీ‌కాకుళం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప‌రిశీల‌కులు మాజీ ఎంపీ డివిజి శంకర్ ను పరిచయం చేశారు. అనంత‌రం రెడ్ క్రాస్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ర‌క్త‌దాన శిబిరంలో ప‌లువురు ఔత్సాహికులు పాల్గొన్నారు. 200 మంది బ్లడ్ డొనేట్ చేశారు.

కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్,  వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మెంటాడ పద్మావతీ, సాధు వైకుంఠ రావు, దానేటి శ్రీధర్, అంబటి శ్రీనివాసరావు, గురుబెల్లి లోకనాథం, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ్, సుంకరి కృష్ణ, మెంటాడ స్వరూప్, మండవిల్లి రవి, అంధవరపు సంతోష్, పైడి రాజారావు,  బొగ్గు అప్పారావు, టి.బాల కృష్ణ, వి.నాగరాజు, చల్లా అలివేలు మంగ, సుగుణ రెడ్డి,జ్యోతి, ఎం. మహాలక్ష్మి, గాయత్రి,  మంజుల తదితరులు పాల్గొన్నారు.
 
  

తాజా వీడియోలు

Back to Top