అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తుందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంతో ప్రారంభించారు. ఉభయ సభలను ఉద్దేశించి శాసనసభలో గవర్నర్ ప్రసంగించారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని, నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని, అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ప్రతి ఏటా 11.43 శాతం గ్రోత్ రేటును సాధించామని, ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందన్నారు.
‘జీఎస్‌డీపీలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉన్నాం. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నాం. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకే నగదు. మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసి పౌష్టికాహారం అందిస్తున్నాం. రూ. 3,669 కోట్లతో పాఠశాలలను ఆధునికరిస్తున్నాం. ఏపీలో తలసరి ఆదాయం రూ. 2.19 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలోని యువత ప్రపంచ స్థాయిలో పోటీపడేలా విద్యారంగంలో మార్పులు తెచ్చాం. అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం. 44.49 లక్షల మంది తల్లులకు రూ.19, 617.60 కోట్లు ఆర్థిక సాయం. విద్యా సంస్కరణలో కీలక అంశంగా డిజిటల్ లెర్నింగ్. విద్యార్థులకు రూ. 690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్‌ల పంపిణీ. జగనన్న విద్యాకానుక కింద ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశ సంస్కరణలు అమలు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల రీడిజైన్.
ఆర్థికభారం లేకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైన రాష్ట్రం ఏపీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కనీసం 2 జూనియర్ కళాశాలల ఏర్పాటు. జగనన్న గోరుముద్దతో ఇప్పటి వరకు. రూ.3,239 కోట్లు ఖర్చుతో 43.26 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి. జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్. జగనన్న విద్యాదీవెన కింద 24.75 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 9,249 కోట్లు చెల్లించాం. హాస్టల్, మెస్ ఛార్జీల కోసం జగనన్న వసతి దీవెన కింద రూ. 20 వేలు చెల్లిస్తున్నాం. ఈ పథకం కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు 3,366 కోట్లు పంపిణీ చేశాం.
కడపలో డాక్టర్ వైయస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ. రాష్ట్రంలో కొత్తంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు. కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశాం. విజయనగరంలో జేఎన్టీయూ-గురజాడ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. కర్నూలులో కస్టర్ యూనివర్సిటీ. ఉన్నత విద్య కోసం 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటు. వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు. పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు.
వైయస్ఆర్ జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు. మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ. ప్రతి నెల ఒకటో తేదీన వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల చెంతకే వైయస్ఆర్ పింఛన్ కానుక అందిస్తున్నాం. ప్రతి నెల 64.45 లక్షల మందికి రూ. 66,823.79 కోట్లు పెన్షన్ల పంపిణీ. వైయస్ఆర్ నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు. 81,783 మంది నేత కార్మికులకు రూ.788.5 కోట్ల పంపిణీ. రూ. 971 కోట్లతో ఆరోగ్య ఆసరా పథకం అమలు. జగనన్న చేదోడు ద్వారా 3.36 లక్షల మందికి రూ.927,49 కోట్లు పంపిణీ. ప్రజల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్. వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు. జగనన్న తోడు పథకం కింద సున్నా వడ్డీకి 15.31 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2,470.3 కోట్లు పంపిణీ చేశాం. వైయస్ఆర్ వాహనమిత్ర కింద 2.74 లక్షల మందికి రూ. 1,041 కోట్లు. వైయస్ఆర్ చేయూత కింద ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 3 విడతల్లో రూ. 14,129 కోట్ల పంపిణీ. 78.74 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు రెండు విడతలుగా రూ. 12,758 కోట్లు విడుదల.
స్థానిక సంస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. నామినేట్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. మహిళల భద్రత కోసం దిశ యాప్ ప్రారంభించాం. ఆపదలో ఉన్న మహిళల వద్దకు నిమిషాల్లో పోలీసులు వచ్చి అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో 56 కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పోస్టులు ఇచ్చాం. ఎస్సీల కోసం 3, ఎస్టీల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. 137 కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టుల్లో 58 శాతం పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. 15.14 లక్షల ఎస్సీ, 4.5 ఎస్టీ కుటుంబాలకు జగ్జీవన్ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం.
వ్యర్థరహిత, చెత్త రహిత గ్రామాలే లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తోంది. స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఏపీ ముందంజలో ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీకి భారీకి పెట్టుబడులు. గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో ఉంది. మాంసం ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది. పాల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ప్రతి గ్రామ సచివాలయంలో ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసినట్లు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో తెలిపారు.