ఘ‌నంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వం

ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్న‌ర్‌

రిప‌బ్లిక్ డే వేడుక‌ల్లో పాల్గొన్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని గవర్నర్‌ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంత‌రం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించిన శ‌క‌టాల‌ ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించారు. వేడుకల్లో శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు, సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో విజటర్స్‌కు అనుమతి నిరాకరించారు. 

Back to Top