మరుగుజ్జు తనంతో కొడిగట్టిన జీవితం... 

ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి చొర‌వ‌తో ప్రభుత్వ పింఛన్ 

నంద్యాల‌:  ప్రకృతి విధించిన శాప గ్రస్తురాలు ఆమె.  శారీరక ఎదుగుదల లేక 3 అడుగుల మరుగుజ్జు గా మిగిలిపోయింది. కానీ ప్రభుత్వాలు చిన్నచూపు చూడకూడదు కదా..! నాటి టీడీపీ ప్రభుత్వం ఈమె పట్ల కనికరం చూపలేదు. వికలాంగురాలు అని జాలి కూడా లేదు. ఆఫీస్ ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా, అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. ఈమె ప్రభుత్వ పింఛన్ కు నోచుకోలేదు. శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలోని ఆత్మకూరు పట్టణం లో ఖల్లా వీధిలోని 31 ఏళ్ల షేక్ నూర్ జహా దీన స్థితి ఇది. శరీరం లో ఎదుగుదల లేదు. జీవన ప్రమాణం లో మెరుగుదల లేదు. పింఛన్ కోసం టీడీపీ ప్రభుత్వం తో పోరాడి పోరాడి అలసి పోయింది. కానీ పొట్ట కూటికి తిప్పలు తప్పవు కదా..! ఆమె పాట్లు ఏవో పడుతూ బతుకు నెట్టుకోస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ పథకాల్లోనే మరుగుజ్జు తనం ఉన్నప్పుడు నూర్ జహా లాంటి మరుగుజ్జు జీవితాల పై చిన్నచూవు కాక ఇంకేం ఉంటుంది..? చివరికి ప్రభుత్వ తోడ్పాటు పై ఆమె ఆశలు వదులుకుంది.

శిల్పన్న మాటిచ్చాడు... నెరవేర్చాడు
2019 లో  రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం సందర్బంగా నాటి వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఆ వీధికి వెళ్లారు. ఆమె దీన గాధ విన్నాడు. "అమ్మా.. ఇది చెవిటి, గుడ్డి టీడీపీ ప్రభుత్వం.. నీ దైన్యం వీళ్లకు వినిపించదు.. కనిపించదు... నువ్వు దిగులు పడొద్దు... కొన్ని నాళ్ళు ఓపిక పట్టు. మన జగనన్న ప్రభుత్వం వస్తుంది. నీకు పింఛన్ ఇప్పించే బాధ్యత నాది " అంటూ శిల్పన్న హామీ ఇచ్చాడు. ఎన్నికలు అయ్యాయి. శిల్పన్న ఎమ్మెల్యే అయ్యాడు. జగనన్న ప్రభుత్వం రానే వచ్చింది.
బాలా రిష్టాలు దాటింది. కరోనా విపత్కర సవాళ్ళను అధిగమించింది.  ఎమ్మెల్యే శిల్పా చొరవ తో నూర్ జహా కు రూ. 3000 పింఛన్ మంజూరు అయింది. గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్బంగా ఎమ్మెల్యే ఆ ఇంటికి వెళ్ళాడు.
నూర్ జహా ఆనందానికి అవధుల్లేవు... సాయం చేసిన అన్న కళ్లెదుట ఉంటే ఆ కళ్ళు చెప్పే భాష్యాలే వేరు...
ప్రజా జీవితం లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లోని ఆనందమే వేరు కదా..! ఆ ఆనందాన్ని ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి గడప గడప లోనూ అనుభవిస్తున్నాడు.

తాజా వీడియోలు

Back to Top