`ఆరోగ్య శ్రీ`పై కూట‌మి స‌ర్కార్ కుట్ర‌

వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
 

తాడేపల్లి: ఆరోగ్యశ్రీ ప‌థ‌కాన్ని ప్రైవేట్‌ప‌రం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. పేదలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేయడానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుటున్నారంటూ ఆయ‌న‌ ధ్వజమెత్తారు. దేశంలోనే ఆదర్శంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని వైయ‌స్ఆర్‌ తెచ్చారని.. ఇప్పటి వరకు ఎంతోమంది పేదలకు ఆరోగ్యశ్రీ ఉపయోగపడిందన్న గోపిరెడ్డి.. అలాంటి పథకాన్ని ప్రభుత్వం ప్రైవేట్‌ పరం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు లబ్ధి చేకూరేలా వైయ‌స్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. కానీ చంద్రబాబు పూర్తిగా పథకాన్ని తొలగించి పేదలకు అన్యాయం చేశారు. కాంక్లియర్, బోన్‌మెరో ట్రాన్స్‌లేషన్ వంటి పెద్దపెద్ద ఆపరేషన్‌లు ఇక మీదట పేద, మధ్యతరగతి ప్రజలు చేయించుకోలేరు. అనేకానేక ఆపరేషన్లకు ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇవ్వవు. సహజంగా డబ్బులు ఎగ్గొట్టాలనే ఇన్సూరెన్స్ సంస్థలు చూస్తాయి. అలాంటప్పుడు రోగుల పరిస్థితి ఏంటి?’’ అంటూ గోపిరెడ్డి ప్రశ్నించారు.

వైయ‌స్‌ జగన్ తెచ్చిన 10,032 విలేజీ క్లీనిక్‌లను‌ కూడా చంద్రబాబు గాలిలో పెట్టారు. 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌ పరం వేశారు. విద్య, వైద్యాన్ని ప్రభుత్వాలే అందించాలి. కానీ చంద్రబాబు వీటిని కూడా ప్రైవేట్‌ పరం చేశారు. ఆస్పత్రులన్నీ ఇన్సూరెన్స్‌ కంపెనీల చుట్టూ ఎలా తిరుగుతాయి?. చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకోవు. ఇలాంటి పరిస్థితుల్లో పేదల పరిస్థితి ఏంటి?. ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా తొలగించటం సరికాదు. కనీసం ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలు తీసుకోండి’’ అని గోపిరెడ్డి హితవు పలికారు.

ప్రైవేట్‌ కంపెనీలకు ప్రీమియం చెల్లించినా రూ.3,500 కోట్లపైన ప్రభుత్వం చెల్లించాలి. ఆరోగ్యశ్రీ కింద ఖర్చు కూడా దాదాపుగా అంతే ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు ప్రైవేట్‌ పరం చేస్తున్నారు?. పంటల బీమానే చెల్లించని చంద్రబాబు ఆరోగ్యశ్రీకి వేల కోట్ల ప్రీమియం ఎలా చెల్లిస్తారు?. ఆరోగ్యశ్రీ పేమెంట్లను కూడా ఆస్పత్రులకు ఆపేశారు. దీంతో ఆస్పత్రిలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. లోకేష్ సొంత మనుషులతో ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టిస్తున్నారు. వారికి అప్పగించటానికే ఇలాంటి పనులు చేస్తున్నారు.

ఆరోగ్యశ్రీని కదిలిస్తే ఈ ప్రభుత్వానికి ముగింపు పలికినట్టే. నాలుగైదు గంటల్లోనే ఇన్సూరెన్స్ కంపెనీలు అనుమతులు ఇస్తాయనేది అబద్ధం. ఆరోగ్యశ్రీని నిలిపివేస్తే వైయ‌స్ఆర్‌సీపీ తరపున ఆందోళన చేస్తామ‌ని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

Back to Top