రేపు నెల్లూరుకు గౌత‌మ్‌రెడ్డి భౌతిక కాయం

హైద‌రాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ‌ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి (50) హ‌ఠాన్మర‌ణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. మేకపాటి కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు దిగ్భ్రాంతికి గుర‌య్యారు. గౌత‌మ్ రెడ్డి మృతిప‌ట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించారు. మంగ‌ళ‌వారం  ద‌యం 8.30 గంట‌ల‌కు గౌతంరెడ్డి భౌతిక‌కాయాన్ని మిలటరీ హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నెల్లూరు కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరులో కార్యకర్తల సందర్శ కోసం గౌతం రెడ్డి ఇంట్లో భౌతిక కాయం ఉంచుతారు. ఎల్లుండి బ్రాహ్మణ పల్లె లో మధ్యాహ్నం 1 గంటకు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top