అస్తవ్యస్తమైన పాలనలో గాడిలో పెడుతున్నాం

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 

 

సచివాలయం: అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గాడిలో పెడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఐదేళ్లలో ఎన్‌ఆర్‌ఈజీఏ నిధులను ఏ విధంగా దుర్వినియోగం చేసిందో తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యామన్నారు. కార్యకర్తలకు పంచిపెట్టేందుకు నిధులు ఉపయోగించుకున్నారన్నారు. మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా ఉండాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, శ్మశానవాటిక, స్కూల్‌ కాంపౌండ్స్‌ వంటి కార్యక్రమాలు చేపట్టినా.. ఏరకమైన ఎనాలసిస్‌తో వెళ్లాలని కోఆర్డినేషన్‌ మీటింగ్‌లో అధికారులతో చర్చించామన్నారు. అస్తవ్యస్తమైన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా.. మార్చి వరకు వచ్చే అమౌంట్‌ను ప్రతి నియోజకవర్గానికి ఏరకంగా సద్వినియోగం చేసుకోవాలని చర్చించామన్నారు. సెర్ప్, యానిమేటర్లు, డ్వాక్రా సంఘాల సమస్యలు, ఆసరా సమస్యలు చర్చించామన్నారు.

 

Read Also: ముగిసిన కేబినెట్‌ సమావేశం

Back to Top