ముగిసిన కేబినెట్‌ సమావేశం

ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇంగ్లిష్‌ మీడియం బోధనకు ఆమోదం

మొక్కజొన్న రైతులపై చర్చ

రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

 

సచివాలయం: ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇంగ్లిష్‌ మీడియం బోధనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరిగింది. కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఇసుక రవాణాలో ఎవరైనా అక్రమాలు, అవినీతికి పాల్పడితే రెండేళ్లు జైలుశిక్షతో పాటు జరిమానా విధించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

అదే విధంగా ఇంగ్లిష్‌ మీడియం బోధనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం బోధన వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్‌ పాఠశాలన్నింటిలో అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మొక్కజొన్న రైతులను ఆదుకునేలా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మొక్కచొన్న ధరలు పడిపోతుండడంపై కేబినెట్‌లో చర్చ జరగడంతో.. రైతులు నష్టపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. మొక్కజొన్న ధర క్వింటాల్‌కు రూ.2200 నుంచి రూ.15 వందలకు పడిపోయింది. తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. కాగా, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

 

Read Also: చంద్రబాబువి దొంగ దీక్షలు..కొంగజపాలు

తాజా ఫోటోలు

Back to Top