నూత‌న వ‌ధూవ‌రుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఆశీస్సులు

అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజర‌య్యారు. రాప్తాడు జాతీయ రహదారి సమీపంలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు మోక్షిత విష్ణుప్రియా రెడ్డి, తేజేష్‌ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన  వైయస్‌ జగన్‌. ఈ సందర్భంగా వైయ‌స్ జగన్‌ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మరోవైపు.. వైయ‌స్ఆర్‌కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు వైయ‌స్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. వైయ‌స్ జ‌గ‌న్ రాక‌తో రాప్తాడు జ‌న‌సంద్రంగా మారింది.  

Back to Top