ప్ర‌భుత్వ సంక్షేమాన్ని వివ‌రిస్తూ..ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ..

పూతలపట్టు నియోజకవర్గంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం

ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు క‌రిపివారి ప‌ల్లె గ్రామంలో ఘ‌న స్వాగ‌తం

చిత్తూరు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా గ‌డప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వీరామంగా కొన‌సాగుతోంది. ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు ప్రతి ఇంటికి వెళ్తూ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ..ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకొని..ఎక్క‌డిక్క‌డే ప‌రిష్క‌రిస్తున్నారు. పూత‌ల‌ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గం బంగారు పాలేం మండలం , సంక్రాంతి పల్లి సచివాలయం పరిధిలోని కరిపి వారి పల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  గ్రామస్తులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు  ఎమ్మెల్యేకు  ఘనంగా స్వాగతం పలికారు.   అనంతరం ప్రతి గడపకు వెళ్లి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అందిస్తున్న పథకాలను ఎంఎస్ బాబు వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top