అమరావతి: రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న మూడున్నర ఏళ్ళ పాలనలో రాష్ట్రంలోని ప్రతి గడపలో అర్హతల ప్రకారం సంక్షేమ ఫలాలు లభించాయని శాసనసభ్యులు పేర్కొంటున్నారు. గురువారం నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా, పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు, కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలోని కొమరాజులంక గ్రామంలో ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేలకు ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదురెళ్లి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏఏ స్థాయిలో , ఏఏ వర్గాలకు, చెందుతున్నాయో, ఏమాత్రం చెందుతున్న అన్న అంశంపై ఎమ్మెల్యేలు ఆరా తీసి అడిగి తెలుసుకుంటున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఎక్కడిక్కడే పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే నూతన ఒరవడికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అనే ఆలోచనతో పరిపాలన చేయగా నేడు మన జగనన్న ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. పారదర్శక పాలన అంటే ఇదే అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాధరణ పొందుతున్నదని తెలియజేశారు. వైయస్ జగన్ అందిస్తున్న సంక్షేమ సంక్షేమ పథకాలైన నవరత్నాలు తదితర అంశాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో ముఖ్యమంత్రి పై నమ్మకం కుదిరించుకుంటూ అభివృద్ధి వైపు పయనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమం అనేక రకాలైన హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని కొనియాడారు.

