పార్వతీపురం: ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇంటింటికి వెళ్తున్న ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం పెద్దింపేట పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రారంభించారు. 3వ రోజు ఉదయం పెద్దింపేట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొని ఎస్సీ కాలనీలో సంచాన గంగయ్య ఇంటి వద్ద నుంచి కార్యక్రమం ప్రారంభించి ప్రతీ ఒక్క ఇంటికీ వెళ్లి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సందేశంతో కూడిన ఉత్తరాన్ని అందిస్తూ తమ ప్రభుత్వం 3 ఏళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ద్వారా వారికి చేసిన మేలుని వివరిస్తూ, గ్రామానికి చేసిన అభివృద్ధిని తెలియచేస్తూ వారందరి నుంచి ఆశీర్వాదములు తీసుకుంటున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 95 శాతానికి పైగా నెరవేరుస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడిన ఏకైక ప్రభుత్వం తమది అని మీ అందరి దీవెనలు సీఎం వైయస్ జగన్ పై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను కూడా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి వెను వెంటనే చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షులు, మండల ఎంపిడిఓ, ఏఓ, ఏపిఓ, ఏపిఏం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.