దొంగ జీవోలతో బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు

 బీసీలను మోసం చేసి రాజకీయ లబ్ధి పొందే కుట్ర  

 గోరంట్ల మాధ‌వ్ ధ్వ‌జం

పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌

 బీసీలను అణగదొక్కుతున్న చంద్రబాబు.. బీసీ నేతలపై కేసులు, అరెస్టులు  

 బీసీలకు రాజకీయ ప్రాధాన్యం, రిజర్వేషన్లు, 59 కార్పొరేషన్లు కల్పించిన ఘనత వైయ‌స్‌ జగన్‌గారిదే

 స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వానికి గుణ‌పాఠం త‌ప్ప‌దు 

 ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన‌ గోరంట్ల మాధవ్  

తాడేపల్లి:  బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగనివ్వకుండా అడ్డుకుంటూనే.. మరోవైపు బీసీల సంక్షేమం, రిజర్వేషన్ల పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ధ్వజమెత్తారు. దొంగ జీవోలతో బీసీలను మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గోరంట్ల మాధవ్‌.. బీసీ నేతలను కేసులు, అరెస్టులతో అణచివేస్తూ మరోవైపు బీసీల పక్షపాతిగా చెప్పుకోవడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

- బీసీలను అణగదొక్కుతున్న చంద్రబాబు

“బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగనివ్వకుండా అడ్డుకుంటున్నది చంద్రబాబు నాయుడే. పడుకున్న పిల్లవాడిని గిల్లి ఏడిపించేది ఆయనే.. జోలపాట పాడేది ఆయనే అన్నట్టుగా బీసీలను అణగదొక్కుతూ, మరోవైపు బీసీల కోసం పనిచేస్తున్నట్టు నటిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్ల పేరుతో కొత్త కుట్రకు తెరతీశారు. బీసీలపై చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని తప్పుడు కేసులో 60 రోజులుగా జైల్లో ఎందుకు ఉంచారు? కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడిని, జోగి రమేష్‌ను జైల్లో పెట్టింది ఎవరు? విడదల రజినిపై అక్రమ కేసు పెట్టింది ఈ ప్రభుత్వమే కదా. బీసీ నేతలను కేసులు, అరెస్టులతో అణచివేస్తూ బీసీల పక్షపాతిగా ఎలా చెప్పుకుంటారు? బీసీల పట్ల చంద్రబాబు కడుపులో కత్తెర్లు.. నోట్లో చెక్కర్లు అన్నది మరోసారి రుజువైంది. చంద్రబాబు ఒక మేకవన్నె పులి.. తేనెపూసిన కత్తి. బీసీ సమాజం ఆయన ద్వంద్వ వైఖరిని గమనిస్తోంది” అని గోరంట్ల మాధవ్‌ అన్నారు.

- వైయ‌స్ జ‌గ‌న్ హ‌యాంలోనే బీసీలకు అగ్రపీఠం 

“బీసీలు అగ్రవర్ణాలతో సమానంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలన్న ఆలోచనతో పనిచేసిన నాయకుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు. సర్పంచుల నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రివర్గం, ఉప ముఖ్యమంత్రి పదవుల వరకు బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చిన చరిత్ర జగన్‌గారిది. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లు పెట్టించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్‌ కోసం పోరాడారు. 139 బీసీ కులాలకు 59 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం బలమైన వ్యవస్థను నిర్మించారు. అలాంటి బీసీలను ఇప్పుడు చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారు. ఆయన కల్లిబొల్లి మాటలకు, అబద్ధపు జీవోలకు, కోర్టుల చుట్టూ తిరిగే రాజకీయాలకు సమాధానం చెప్పేందుకు బీసీ సమాజం సిద్ధంగా ఉంది. కాసుకో చంద్రబాబు నాయుడూ” అని గోరంట్ల మాధవ్‌ పేర్కొన్నారు.

Back to Top