సుప్రీం తీర్పు తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు

 ఇకనైనా మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలి
 
 మూడు రాజధానులు ఏర్పాటు.. మూడు ప్రాంతాల అభివృద్దే లక్ష్యం

 మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై సుప్రీం కోర్టు తీర్పు తెలుగుదేశం పార్టీ కి చెంపపెట్టు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బెలుగుప్ప మండలం కాలువపల్లి లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వికేంద్రీకరణ పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అనే విషయం సుప్రీం తీర్పుతో బలపడిందన్నారు.కోర్టు తీర్పు తోనైనా చంద్రబాబుకు కనువిప్పు కలగాలని మాజీ ఎమ్మెల్యే అన్నారు.అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కు పాల్పడి చంద్రబాబు తన పార్టీ నేతలతో భూములు కొనిపించి భావి తరాలకు అన్యాయం చేసేలా వ్యవహరించారన్నారు.అంతే కాక రియల్టర్లు, పెయిడ్ ఆర్టిస్టలతో చంద్రబాబు అమరావతి యాత్ర చేయించారు’ అని విమర్శించారు. బాబు ఇకనైనా ప్రజలను రెచ్చగొట్టి మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. వికేంద్రీకరణే తమ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి అభిమతమని ప్రాంతీయ అసమానతలు లేకుండా రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మూడు రాజధానులు ఏర్పాటైతే వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెద్దన్న, సర్పంచ్ ఎమ్ డి పెద్దన్న, మాజీ ఎంపిటిసి వెంకటేసులు, తిమ్మన్న, ఫక్రుద్దీన్, బెలుగుప్ప, అవులెన్న సహకార సంఘ అధ్యక్షులు శివలింగప్ప, శ్రీనివాసులు, రమనేపల్లి సర్పంచ్ రమేష్, గంగవరం ఎంపిటిసి ప్రసాద్, నాయకులు ఎర్రిస్వామి, బాబునాయక్, వెంకటేసులు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top