గ్రామ సచివాలయాలతో పారదర్శక పాలన

కూడేరులో నూతన భవనాలు ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: ప్రజలకు పారదర్శక పాలన అందించాలని వారి ఇంటి వద్దకే పాలన తీసుకురావాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కూడేరు మండల కేంద్రంలోని సచివాలయం-2 పరిధిలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతుభరోసా కేంద్రాలను ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రిబ్బన్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు సత్వరమే అందుకోవడానికి సచివాలయాలు ఉపయోగపడతాయన్నారు. ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేసి దేశానికే రోల్‌ మోడల్‌గా ప్రజా ప్రభుత్వాన్ని వైయ‌స్ జ‌గ‌న్‌ ఏర్పాటు చేశారన్నారు. ప్రజా పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం దిశగా పయనిస్తున్నట్లు తెలిపారు.అదే విదంగా  వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆరుగాలం కష్టపడే రైతుకు అండగా, భరోసాగా ఉండాలనేది ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. రైతుకు నిత్యం తోడుగా ఉండాలని రైతు సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేసేందుకు వైయ‌స్ఆర్‌ రైతు భరోసా  కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రతి గ్రామం సర్వతోముఖాభివృద్ధి చెందాలని  వైయ‌స్ జగన్ ఇవన్నీ చేస్తున్నాడన్నారు. 

Back to Top