వైయ‌స్ఆర్‌సీపీ విజయానికి బాటలు వేయాలి

 ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే గ్రామ సచివాలయ కన్వీనర్ల వ్యవస్థ
 
ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోంది

అభివృద్ధిని కళ్ళుండి చూడలేని కాబోదులు ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా

ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్

చంద్రబాబు వంటి నాయకులు ఉండడం రాష్ట్రానికి పట్టిన శని
 
మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి 

అనంత‌పురం: సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు సమన్వయంతో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించి 2024 ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయానికి బాటలు వేయాలని ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, చిత్తూరు జెడ్పి చైర్మన్,నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఉరవకొండ లోని వీరశైవ కల్యాణ మండపంలో వజ్రకరూరు మండల సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు, వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నేతలతో సమావేశాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి, శ్రీనివాసులు మాట్లాడుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ప్రజలకు ఇంటి వద్దే అందించే లక్ష్యంతో సచివాలయ, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు.ఏపీ లోని సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను జగన్ తీసుకొచ్చారని వలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు సమన్వయంతో ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవచూపాలన్నారు.సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు, గృహసారథులు పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు. ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధితో రాష్ట్రం దూసుకుపోతుందని వారు చెప్పారు. అయితే రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న మంచిని.. అభివృద్ధిని ప్రతిపక్ష పార్టీలతో పాటు ఎల్లో మీడియా కూడా కళ్ళుండి చూడలేని కబోదుల్లా మారారని వారు విమర్శించారు. గ్రామ గ్రామాన సచివాలయాలు, ఆర్బికేలు, హెల్త్ సెంటర్లు నిర్మాణం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలతో నాడు -నేడు కింద ప్రభుత్వ స్కూల్లను అభివృద్ధి చేయడం మీ కంటికి కనిపించదా అని అడిగారు.టిడిపి హయాంలో 39 లక్షల వరకు ఉన్న పింఛన్లు నేడు 62 లక్షల చేరడం సంక్షేమంలో ముందంజ కాదా అన్నారు. ఇన్ని జరుగుతున్న నిత్యం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా పనిచేస్తున్నాయని విమర్శించారు. కుల, మత, ప్రాంత వర్గాలకు అతీతంగా సంక్షేమ పాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశం ఎవరైనా ఉన్నారంటే అది వైయ‌స్ జ‌గ‌న్‌ ఒక్కడే అని వారన్నారు. చంద్రబాబు వంటి ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండడం ఈ రాష్ట్రానికి పట్టిన శనిగా వారు అభివర్ణించారు. అందుకే ఆయన మీటింగులు పెడితే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారన్నారు.గత ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ చేసిన కుట్రలు, కుతంత్రాల వల్లే ఎమ్మెల్యే గెలిచాడే తప్ప ప్రజాభిమానంతో గెలలేదని అన్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ కుట్రలను ఛేదించి ఉరవకొండ గడ్డపై పార్టీ జెండాను ఎగరవేస్తామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మన గెలుపు..  వైయ‌స్ జ‌గ‌న్‌ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా మనందరం మమేకమవ్వాలి అన్నారు. సీఎం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజా పరిపాలనను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కన్వీనర్లపై ఉందన్నారు. ప్రతి గ్రామంలో మూడున్నర ఏళ్లుగా జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలు ప్రజలు ముందు ఉంచేందుకు సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు బాధ్యతగా పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రి అడ్వైజరి బోర్డు చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, ఎంపిపి దేవి బాయి, వైస్ ఎంపిపి సుశీల రాణి,మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, సర్పంచులు మొనలిసా, జగదీష్, కమలమ్మ, సోమశేఖర్ రెడ్డి, శివాజీ నాయక్,సురేంద్ర,శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, పిఏసీఎస్ చైర్మన్ సుదీర్ రెడ్డి ,జిల్లా నాయకులు ప్రసాద్ రెడ్డి,తిరుపాల్ శెట్టి, ఉస్మాన్,డిష్ సురేష్,వసికెరీ రమేష్,రాచన గౌడ్, మున్నా,మధుసూదన్ రెడ్డి,అమర్నాత్, విజయ్ కుమార్, సంజప్ప, నారాయనప్ప, అల్లప్ప,నారాయణ,ఎంఎల్ఓ తేజేశ్వర్ రెడ్డి,దాసరి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top