వైయ‌స్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భార‌తి

శ్రీ‌కాకుళం: టీడీపీ, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీష వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వారికి వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

 

Memantha Siddham: Key Leaders Join YSRCP In CM Jagan Presence - Sakshi

 

 

 పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, అలాగే పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత,  మహిళా  కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణిలు ప్రముఖంగా ఉన్నారు. సీఎం జగన్‌ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధం అని ప్రకటించారు.

Back to Top