విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలోకి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ విలీనం చేయబోతున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శ్రీపాద వల్లబడు మీద ప్రమాణం చేసి జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయడని చెప్పమనండి అంటూ సవాలు విసిరారు. బుధవారం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు ఓటమి కొత్త కాదు అని పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఓట్లే రావు.. వంగా గీత మీద పవన్ కళ్యాణ్ గెలవడం అసాధ్యం అని చెప్పారు. పవన్ కళ్యాణ్ కు ఓటమి భయంతోనే భీమవరం, గాజువాక నియోజక వర్గాలను వదిలేసాడు అని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయం అయింది కాబట్టే ఏదో ఒక ఆరోపణ చేస్తున్నాడు.. పదేళ్లు పార్టీ నాయకుడుగా ఉండి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చెప్తే ఎంపీ, ఎమ్మెల్యే గానీ పోటీ చేస్తానంట హాస్యాస్పదంగా ఉంది అని వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు. ఏపీలో 175కు 175 నియోజకవర్గాల్లో వైయస్ఆర్ సీపీ జెండా ఎగర వేస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.