రాష్ట్రానికి ప‌ట్టిన చీడ ఏబీఎన్ రాధాకృష్ణ‌

చంద్ర‌బాబు క‌డుపు మంట‌కి రాధాకృష్ణ మాట‌లే ప‌రాకాష్ట‌

రాష్ట్రానికి మావిగ‌న్ అభివృద్ధి మంత్ర‌మ‌ని తేలిపోయింది

ఓర్చుకోలేకనే దిగ‌జారుడు వ్యాఖ్య‌ల‌తో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ 

బ‌ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్, మాజీ మంత్రి కుర‌సాల క‌న్నబాబు

విశాఖ‌ప‌ట్నం పార్టీ సిటీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు కుర‌సాల 
క‌న్నబాబు, గుడివాడ అమ‌ర్నాథ్‌, విజ‌య‌న‌గ‌రం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు మ‌జ్జి శ్రీనివాస‌రావు, ఎమ్మెల్సీ కుంభా ర‌విబాబు.

మావిగ‌న్ మోడ‌ల్‌లో పోర్టు, ఎయిర్‌పోర్టు, నేష‌న‌ల్ హైవేలున్నాయి

అవ‌న్నీ అమ‌రావ‌తిలో వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి కొత్త‌గా నిర్మించాలి

అమ‌రావ‌తిని క‌మ‌రావ‌తి అంటున్నా టీడీపీ ఖండించడం లేదు

గేటెడ్ క‌మ్యూనిటీ అని ఆ పార్టీ నాయ‌కులే అంటున్నారు

అమ‌రావ‌తి అంద‌రి రాజ‌ధాని అని ప్ర‌భుత్వం చెప్ప‌లేక‌పోతోంది

మావిగ‌న్ అన‌గానే చంద్ర‌బాబు డెవ‌ల‌ప్‌మెంట్ కారిడార్లు అంటున్నాడు

రెండేళ్లుగా చంద్ర‌బాబు ఉత్త‌రాంధ్ర, రాయ‌ల‌సీమ ఊసే ఎత్త‌లేదు  

స్ప‌ష్ట చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు 

విశాఖ‌ప‌ట్నం:  రాష్ట్రానికి ఏబీఎన్ ఛానెల్, ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్‌, రాధాకృష్ణ చీడ‌లా త‌యార‌య్యార‌ని, మావిగ‌న్ పేరుతో వైయ‌స్ జ‌గ‌న్ గారు సూచించిన అభివృద్ధి మోడ‌ల్‌పై ప్ర‌జ‌ల్లో గొప్ప స్పంద‌న రావ‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల భార్య‌లను తిట్టి డైవ‌ర్ష‌న్ చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ధ్వ‌జ‌మెత్తారు. విశాఖ‌ప‌ట్నం పార్టీ సిటీ కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు కుర‌సాల క‌న్నబాబు, గుడివాడ అమ‌ర్నాథ్‌, విజ‌య‌న‌గ‌రం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు మ‌జ్జి శ్రీనివాస‌రావు, ఎమ్మెల్సీ కుంభా ర‌విబాబు మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్లూ అమ‌రావ‌తి త‌ప్ప ఏ ప్రాంతాన్నీ ప‌ట్టించుకోని చంద్ర‌బాబు వైయ‌స్ జ‌గ‌న్ గారు మావిగన్ మోడ‌ల్ ప‌రిచ‌యం చేయ‌గానే చంద్ర‌బాబు డెవ‌ల‌ప్‌మెంట్ కారిడార్లు అంటూ హ‌డావుడి చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. వైయ‌స్ జ‌గ‌న్ గారు సూచించిన మావిగ‌న్ పేరుకు వ్య‌తిరేక‌మా లేదా మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరులో రాజ‌ధాని ఏర్పాటు చేయ‌డానికి వ్య‌తిరేక‌మా చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. 

వారు ఇంకా ఏమ‌న్నారంటే...

పాల‌న వదిలేసి మావిగ‌న్ వెంట ప‌డ్డారు
మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరుతో కూడిన (మావిగ‌న్) ప్రాంతాన్ని ఒక కారిడార్‌గా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అవుతుంద‌ని ప్లాన్- బి గా వైయ‌స్ జ‌గ‌న్ గారు సూచిస్తే అధికార పార్టీ ఒక్క‌సారిగా ఉలిక్కిపడింది. వారం రోజులుగా పరిపాల‌న పూర్తిగా గాలికొదిలేసి మావిగ‌న్‌ను ట్రోల్ చేయ‌డానికి అల్లాడుతున్నారు. మావిగ‌న్ అనేది వాళ్ల‌కు అమరావ‌తి వేల కోట్ల అవినీతి మీద ఎక్కుపెట్టిన గ‌న్ లాగా క‌నిపించింది. రూ.20 వేల కోట్ల‌తో మావిగ‌న్ ఏరియాను డెవ‌ల‌ప్ చేస్తే స‌రిపోతుంద‌ని సూచిస్తుంటే కూట‌మి నాయ‌కులు ఎందుకు భ‌య‌ప‌డిపోతున్నారు? అమ‌రావ‌తి కోసం గొప్ప చ‌ట్టాన్ని తెచ్చామ‌ని చెప్పుకునే మీరంతా ఎందుకు ఆవేశ‌ప‌డిపోతున్నారు? అమరావ‌తిని పూర్తి చేయ‌డానికి త‌రాలు ప‌డుతుంద‌ని మీరే చెబుతున్న‌ప్పుడు త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యే మావిగ‌న్ ఐడియా మంచిదే క‌దా. అందుకేనా మీలో ఈ భ‌యం?  ఎప్పుడూ లేనిది అమ‌రావ‌తి ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌ని హ‌డావుడి చేస్తున్నారు. ఇన్నాళ్లూ అమ‌రావ‌తి త‌ప్ప ఏ ప్రాంతాన్నీ ప‌ట్టించుకోని చంద్ర‌బాబు వైయ‌స్ జ‌గ‌న్ గారు మావిగన్ మోడ‌ల్ ప‌రిచ‌యం చేయ‌గానే చంద్ర‌బాబు డెవ‌ల‌ప్‌మెంట్ కారిడార్లు అంటూ మాట్లాడుతున్నాడు. ఏడేళ్లు అధికారంలో ఉండి అమ‌రావ‌తి కోసం కేవ‌లం రూ. 8 వేల కోట్లు ఖ‌ర్చు చేసిన‌ప్పుడు, వారు చెప్పిన రూ.2 ల‌క్షల కోట్లు ఖ‌ర్చుచేసి ల‌క్ష ఎక‌రాలు డెవ‌ల‌ప్ చేయ‌డానికి ఇంకెన్ని ద‌శాబ్ధాలు ప‌డుతుంది. 

క‌డుపు మంట‌కి రాధాకృష్ణ మాట‌లు ప‌రాకాష్ట‌

చంద్ర‌బాబు అంటేనే ప‌డి చ‌చ్చిపోయే రాధాకృష్ణ మాట‌లు క‌డుపు మంట‌కి ప‌రాకాష్ట‌. జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేసే ఏ వ్య‌క్తి ఇంత‌క‌న్నా దిగ‌జారి రాయ‌లేడు. రాధాకృష్ణ జీవితం గురించి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలోనే చ‌ర్చ జ‌రిగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప‌ట్టిన చీడ ఏబీఎన్ ఛానెల్‌, ఆంధ్ర‌జ్యోతి పేప‌రు, రాధాకృష్ణ‌. తెలంగాణ‌లో కూర్చుని ఏపీలో ఎలా బ‌త‌కాలో చెబుతాడు. అమరావ‌తిని పూర్తి చేయ‌డానికి త‌రాలు ప‌డుతుంద‌ని మీరే చెబుతున్న‌ప్పుడు త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యే మావిగ‌న్ ఐడియా మంచిదే క‌దా. ప్ర‌జ‌లంతా మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అవుతార‌ని కూట‌మి నాయ‌కులే చెబుతున్నారు. జీతాల‌కే డ‌బ్బులు లేవంటూ ఆర్ధిక‌మంత్రి, అప్పులు పుట్ట‌డం లేద‌ని చంద్ర‌బాబు మాట్లాడుతూ అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.2 ల‌క్ష‌ల కోట్లు ఎక్క‌డి నుంచి తెస్తారు?  పెట్ట‌రా క‌మ‌రావ‌తి అని రాజ్య‌స‌భ‌లో రేణుకా చౌద‌రి మాట్లాడితే, అమ‌రావ‌తి అంద‌రిదీ అని ఇంత‌వ‌ర‌కు కూట‌మి నాయ‌కులు ఆమె మాట‌ల‌ను ఎందుకు ఖండించ‌లేదు?  ఆమె మాట‌ల‌ను రికార్డుల‌ను తొల‌గించ‌మ‌ని క‌నీసం లేఖ కూడా ఇవ్వ‌లేదు. అమ‌రావ‌తి అనేది గేటెడ్ క‌మ్యూనిటీ అని టీడీపీ నాయ‌కులే చెబుతున్నారు. అమ‌రావ‌తి అనేది దోపిడీ మోడ‌ల్‌. అమ‌రావ‌తిలో నీళ్లు తోడ‌టానికి, మొబిలైజేష‌న్ అడ్వాన్సులు, టెండ‌ర్ల‌లో ఎక్సెస్, డిజైన్ల పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారు. ఇవ‌న్నీ తెలుసు కాబ‌ట్టే బిల్లును వైయ‌స్ఆర్‌సీపీ వ్య‌తిరేకించింది. వైయ‌స్ జ‌గ‌న్ గారు ప్రెస్‌మీట్ లో అడిగిన ప్ర‌శ్న‌లు ఏ ఒక్క‌దానికీ స‌మాధానం చెప్పుకోలేక వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల కుటుంబాల గురించి, మా పార్టీ నాయ‌కుల భార్య‌ల గురించి నీచంగా రాస్తున్నాడు. 

స‌మాధానం చెప్ప‌లేక డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ 

ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోగా క‌ళ్ల‌బొల్లి మాట‌లు, ప‌బ్లిసిటీతో రెండేళ్లుగా చంద్ర‌బాబు కాల‌క్షేపం చేస్తున్నాడు. శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ ఎక్క‌డ రాజ‌ధాని క‌ట్ట‌కూడ‌దు అని సూచించిందో చంద్ర‌బాబు అదే ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. రాజ‌ధాని పేరుతో వేల కోట్ల దోపిడీకి పాల్ప‌డుతున్నాడు. వైయ‌స్ జ‌గ‌న్ గారు ప్ర‌తిపాదించిన మావిగ‌న్ మోడ‌ల్‌తో ఆయ‌న అవినీతి ఆశ‌లు కుప్ప‌కూలిపోయే ప్ర‌మాదం ముంచుకొచ్చింది. ఏం చేయాలో అర్థంకాక వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను వ్య‌క్తిత్వ హ‌న‌నం చేస్తున్నారు. మ‌మ్మ‌ల్ని దూషించి రెచ్చగొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌డం ద్వారా ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపోట‌ముల‌కు రాజ‌ధాని అనేది ప్రామాణికం అయితే 2019లో అమ‌రావ‌తి పేరు చెప్పుకుని కూడా టీడీపీ ఎలా ఓడిపోయింది? 

అమ‌రావ‌తి అవినీతికే చ‌ట్ట‌బ‌ద్ధ‌త తెచ్చారు
- గుడివాడ అమ‌ర్నాథ్‌, మాజీ మంత్రి, రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్  

వైయ‌స్ జ‌గ‌న్ గారు సూచించిన మావిగ‌న్ పేరుకు వ్య‌తిరేక‌మా లేదా మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరులో రాజ‌ధాని ఏర్పాటు చేయ‌డానికి వ్య‌తిరేక‌మా చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి. వైయ‌స్ జ‌గ‌న్ గారు సూచించిన మావిగ‌న్ మోడ‌ల్‌లో పోర్టు, ఎయిర్‌పోర్టు, నేష‌న‌ల్ హైవేలు అన్నీ ఉన్నాయి. కానీ అమ‌రావ‌తిలో ఇవ‌న్నీ వేల కోట్లు ఖ‌ర్చు చేసి కొత్త‌గా నిర్మాణం చేసుకోవాల్సిన ప‌రిస్థితి. అమ‌రావ‌తికి చ‌ట్ట బ‌ద్ధ‌త తీసుకొచ్చామ‌ని ప్ర‌చారం చేసుకుంటున్న చంద్ర‌బాబు, దేశంలో ఏ రాష్ట్రానికి ఈ విధంగా చ‌ట్ట‌బ‌ద్ధ‌త తెచ్చారో చెప్పాలి. చంద్ర‌బాబు తెచ్చిన చ‌ట్ట‌బ‌ద్ధ‌త అమ‌రావ‌తి రాజ‌ధానికి కాదు.. అమ‌రావ‌తి ముసుగులో చేస్తున్న అవినీతికి. 

జ‌గ‌న్ మావిగ‌న్ పేరెత్త‌గానే చంద్ర‌బాబు అభివృద్ధి కారిడార్ అంటున్నాడు
- మ‌జ్జి శ్రీనివాస‌రావు, విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడు

మావిగన్ ప్రాంతానికి ఉన్న సానుకూల‌త‌లు కారణంగా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌తిపాదించ‌గానే చంద్ర‌బాబులో వ‌ణుకు మొద‌లైంది. ఇన్నాళ్లూ కారిడార్లు అంటూ రాయ‌ల‌సీమ‌, ఉత్తరాంధ్ర గురించి ఎందుకు మాట్లాడ‌లేదు?  విశాఖ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ గారు భావిస్తే టీడీపీ నాయ‌కులు ఏమాత్రం స‌హ‌క‌రించ‌లేదు. ఉత్త‌రాంధ్ర‌లో జ‌రిగిన అభివృద్ధి వైయ‌స్ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లోనే జ‌రిగింది. రెండేళ్ల‌లో ఉత్త‌రాంధ్ర నాయ‌కులు కూడా అమ‌రావ‌తి భ‌జ‌న చేస్తున్నారే కానీ, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల మ‌నోభావాలు గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. 

రాధాకృష్ణ రాత‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి
- కుంభా ర‌విబాబు, ఎమ్మెల్సీ

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త పేరుతో శాస‌న‌మండ‌లిలో తీర్మాణం చేయ‌కుండా శాస‌నస‌భ‌లో మాత్ర‌మే చ‌ర్చించి కేంద్రానికి పంపించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ల‌క్ష‌ల కోట్ల‌తో చంద్ర‌బాబు డెవ‌ల‌ప్ చేయాల‌నుకుంటున్న అమ‌రావ‌తి వ‌ల్ల ల‌బ్ధి పొందేది ఎవ‌రు? ఈ అప్ప‌ల భారం రాష్ట్ర ప్ర‌జ‌లంతా మోయాలా? రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ గారు భావిస్తే చంద్ర‌బాబు అడుగ‌డుగునా అడ్డుత‌గిలాడు. చంద్ర‌బాబు మోసాల‌ను రాష్ట్ర ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నారు. ఏమాత్రం స‌భ్య‌త‌, సంస్కారం ఉన్నా ఏబీఎన్ రాధాకృష్ణ త‌న వ్యాఖ్య‌ల‌ను త‌క్ష‌ణం వెనక్కి తీసుకోవాలి. రాధాకృష్ణ రాస్తున్న వికృత రాత‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి.

Back to Top