చంద్రబాబు పాలనపై ఏ వర్గం సంతోషంగా లేదు

తునిలో మరోసారి నిస్సిగ్గుగా అబద్దాల పరంపర

జనం వీడ్కోలు బటన్ నొక్కడానికి సిద్దంగా ఉన్నారు

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టీకరణ

తునిలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ  నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా 

ప్రతీ నెలా ఒకటో తేదీన చంద్రబాబు వినోదం

తునిలో మరోసారి ఇలాంటి స్కిట్ చేశారు

అబద్ధాలు వినలేక మహిళలు పారిపోయారు

రెండేళ్ల పాలనలో ఎటు చూసినా విధ్వంసమే

దాడిశెట్టి రాజా ఫైర్

చంద్రబాబు వెళ్లిన గ్రామంలోనే జగన్ సంక్షేమ ఆనవాళ్లు

సభా స్ధలి దాటి గ్రామంలోకి వెళ్తే అన్నీ కనిపించేవి 

చప్పట్లు కొట్టమని అడుకోవాల్సిన దుస్దితి చంద్రబాబుది

తమ కోసం ఎవరు పనిచేశారో రాష్ట్రంలో పేదలకు తెలుసు

దాడిశెట్టి రాజా స్పష్టీకరణ

జగన్ హయాంలో  66 లక్షలకు పైగా పెన్షన్లు

6 లక్షల పెన్షన్లు తీసేసిన చంద్రబాబు సర్కార్

పెన్షన్ల విషయంలోనూ చంద్రబాబు అబద్దాలు

20 లక్షల ఉద్యోగాల పేరుతో కొత్త అబద్దాలు

దాడిశెట్టి రాజా ఆక్షేపణ

నిస్సిగ్గుగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ మాటలు

ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎవరికిచ్చారు?

మేం ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడి

మీకు వీడ్కోలు బటన్ నొక్కేందుకు జనం సిద్దం

తేల్చేసిన దాడిశెట్టి రాజా 

తుని: రాష్ట్రంలో గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంతో పోలిస్తే 6 లక్షలకు పైగా పెన్షన్లను తొలగించిన చంద్రబాబు .. ఇవాళ తుని సభలో మాత్రం తానే పెన్షన్ల ప్రదాత అన్నట్లుగా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పుకున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. చంద్రబాబు అబద్దాలు వినలేక మహిళలు పది నిమిషాల్లోనే పారిపోయారని, వారికి నిజంగా పెన్షన్లు ఇంటింటికీ ఇచ్చింది వైయ‌స్ జ‌గ‌న్‌ అన్న విషయం తెలుసని దాడిశెట్టి రాజా తెలిపారు. సూపర్ సిక్స్- సూపర్ హిట్ అంటూ పచ్చి అబద్దాలు చెప్తున్న చంద్రబాబు.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. వాటిపై ప్రశ్నిస్తే తమపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, చంద్రబాబుకు జనం వీడ్కోలు బటన్ నొక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని దాడిశెట్టి రాజా హెచ్చరించారు.
ప్రెస్ మీట్లో దాడిశెట్టి రాజా ఇంకేమన్నారంటే...

- ప్రతీ నెలా ఒకటో తేదీన చంద్రబాబు వినోదం

చంద్రబాబు యథావిధిగా ప్రతీ నెలా ఒకటో తేదీన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వినోదం పంచుతుంటారు. ఇందులో భాగంగా తుని నియోజకవర్గంలోని చామవరంలో ఇవాళ స్కిట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా అసత్య ప్రచారాలు, అబద్దాలు, విద్వేష పూరిత ప్రసంగాలు తుని నియోజకవర్గ ప్రజలకు, ఆ మీటింగ్ కు వెళ్లి పారిపోయిన మహిళలకు కూడా ఉన్నంత సేపూ వినోదం పంచిపెట్టారు. ఆయన రెండు సంవత్సరాల పాలన సూపర్ హిట్ అని చెప్పుకున్నారు. మరి ఈ రెండేళ్లలో మీరు సూపర్ సిక్స్, సూపర్ 7 అని రకరకాల హామీలిచ్చి వెన్నుపోటు పొడిచారు, దగా చేశారు. అవన్నీ కప్పిపుచ్చడానికి మా పార్టీ మీద, మా మీద దూషణలు, అసత్యాలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌ గారి కంటే రెట్టింపు సంక్షేమం ఇస్తానని చెప్పి వచ్చి రెండేళ్లలోనే 3.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. ప్రశ్నిస్తే అబద్దాలు, బుకాయింపులే. ఈ రెండేళ్లలో మీరు రాష్ట్రంలో ప్రజలందరికీ అన్యాయం చేశారని వారు భావిస్తున్నారు. ఇందులో వ్యాపారులు, రైతులు, డాక్టర్లు ఇలా ప్రతీ వర్గం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కాదా ? అవన్నీ కప్పిపుచ్చడానికి మా మీద వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రెండేళ్లు కరోనాతో రాష్ట్రం ఇబ్బందులు పడింది. ఆయన పాలన చేసింది మూడేళ్లు. ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. మీరు వచ్చాక ఆయన పేర్చిన ఇటుకలన్నీ విధ్వంసం చేశారు. విద్య, వైద్యం, ఆర్ధిక రంగాల్లో రాష్ట్రాన్ని రెండేళ్లలోనే అథోగతి పాలు చేశారు. 

- తుని సభలో అబద్ధాలు వినలేక జనం పారిపోయారు

మీరు వెళ్లిన గ్రామంలో మా ప్రభుత్వ హయాంలో ఓ సచివాలయం, ఓ రైతు భరోసా కేంద్రం, ఓ హెల్త్ సెంటర్,ఓ నాడు-నేడు స్కూల్ కానీ కనిపిస్తాయి. ఒక్కసారి మీరు స్టేజ్ దిగి వెళ్లి ఉంటే ఇవన్నీ కనిపించేవి. అవన్నీ మీరు ఈ రెండేళ్లలో విధ్వంసం చేశారు. ఈ రెండేళ్లలో మీరు చేసిన విధ్వంసం ప్రతీ సచివాలయంలో, ప్రతీ స్కూల్లో, ప్రతీ ఆస్పత్రిలో కనిపిస్తోంది. మీ విధ్వంస పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. అది మీ ఎదురుగా కూర్చొన్న మహిళల్ని చూస్తేనే అర్దమవుతోంది. మీరు మాట్లాడటం మొదలుపెట్టిన పది నిమిషాలకే వారు పరుగో పరుగు. మీ నిర్వాకాలకు చప్పట్లు కొట్టమని అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది. దీన్ని బట్టి మీ పాలన ఎంత అద్భుతంగా ఉందో అర్దమవుతుంది. దాన్నుంచి డైవర్ట్ చేయడానికి మాపై వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి గురించి మాట్లాడుతున్నారు. ఎవరు పేదల కోసం పనిచేశారో, ఎవరు పెత్తందారుల కోసం పనిచేశారో రాష్ట్రంలో అందరికీ తెలుసు. పూర్తి స్దాయిలో పెన్షన్లు ఇస్తున్నారా లేదా ? ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా ? పూర్తి స్ధాయిలో గ్యాస్ సిలెండర్లు ఇచ్చారా ? ఆడబిడ్డ నిధి ఇచ్చారా ? నిరుద్యోగ భృతి ఇచ్చారా ? అది చెప్తూ మీ ప్రసంగం కొనసాగించి ఉంటే రాష్ట్రంలో ఆడబిడ్డలు, ప్రజలు మీ మాటలు వినేవారు. మీ ప్రభుత్వం వచ్చాక ప్రతీ నెలా ఒకటో తేదీన చెప్పే ఊకదంపుడు సోదే ఇవాళ మళ్లీ చెప్పారు. 

ఆడబిడ్డ నిధి గురించి, నిరుద్యోగ భృతి గురించి, రైతులకు ఇవ్వాల్సిన 40 వేల గురించి, గ్యాస్ సిలెండర్ల గురించి మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. కానీ మీరు చెప్పకపోవడం వల్ల రాష్ట్ర ప్రజలకు కూడా మీ ప్రసంగాలంటే విరక్తి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు అప్పులు చేశారని నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారు, కాగ్ డేటా చూస్తే 3.40 లక్షల కోట్లు మాత్రమే చేశారని తేలిపోయింది. అన్ని ఆధారాలున్నా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మాత్రం రెండేళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఐదేళ్లలో 3.4 లక్షల కోట్లు అప్పులు చేసిన  జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ రూపంలో రాష్ట్ర ప్రజలకు పంచి పెట్టారు. ఈ రాష్ట్రంలో ఫైనాన్స్ ఇంజనీరింగ్ చేసారు. ఎప్పుడూ ప్రజల దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉండేవి. ఆ డబ్బంతా వ్యాపారస్తులు, పరిశ్రమల్లోకి రొటేషన్ జరిగేది. కానీ ఇప్పుడు ప్రజలు, వ్యాపారాలు ఒక్క రూపాయి లేక విలవిల్లాడిపోతున్నారు. మీరు చేసిన 3.5 లక్షల కోట్ల అప్పులు ప్రజలకు ఇస్తే వారు సంతోషంగా ఉండేవారు. అవన్నీ చేయకుండా నెల నెలా సోది చెప్పే వినే వారు ఎవరూ లేరు. పేదలకు పెన్షన్ ఇంటింటికీ ఇవ్వడం నేనే మొదలుపెట్టానని చంద్రబాబు అబద్దాలు చెప్పుకుంటున్నారు. కానీ ఎవరు సచివాలయాలు, వాలంటీర్లను పెట్టి పేదలకు ఇంటికి పెన్షన్ పంపించారనేది పేదలకు తెలియదా ? రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని సాగనంపడానికి బటన్ నొక్కడానికి సిద్దంగా ఉన్నారు. ప్రజలకు ఇప్పటికీ కరెంటు కష్టాలే. ఎల్లో మీడియాలో మాత్రం కరెంటు అంతరాయం అని రాసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా ఉక్కపోతతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం నిద్రపోతోంది. రాష్ట్ర ప్రజలకు ఇవాళ మీరు ఛీఫ్ మినిస్టర్ గా కాకుండా వెరీ చీప్ మినిస్టర్ గా కనిపిస్తున్నారు.  మీ మాటలు విని వారంతా ఇంత చీప్ మినిస్టరా అని అనుకుంటున్నారు. 

- జగన్ హయాంలో ఇచ్చిన పెన్షన్లలో 6 లక్షలకు పైగా కోతలు

జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా.. 66 లక్షల 34 వేల 372 మందికి పెన్షన్లు ఇచ్చేవారు. మీరు వచ్చాక 60 లక్షల 11 వేల 209 మందికి పెన్షన్ ఇస్తున్నారు. సుమారుగా 6 లక్షల మందికి పైగా పెన్షన్లు కట్ చేసేశారు. అదేదో పెద్ద గొప్పగా చెప్తున్నారు. ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చింది లేదు. తుని నియోజకవర్గంలో కొత్తగా ఎవరో సాయం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చరిత్ర ఓసారి గమనిస్తే ప్రతీ చోటా నేను చేసిన సాయం కనిపిస్తుంది. ఓ పేజీ వెనక్కి తిప్పితే మేం చేసిన సాయం కనిపిస్తుంది. మేం అధికారానికి దూరంగా ఉన్నాం కాబట్టి వాళ్లు అభాగ్యులుగా మారుతున్నారు. మాట్లాడితే 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 కోట్ల ఉద్యోగాలు. ఈ మధ్యే పాయకరావుపేటలో స్టీల్ ప్లాంట్ కు కొబ్బరికాయ కొట్టారు. జిందాల్ స్టీల్ ప్లాంట్ తో ఒప్పందాలు చేసుకున్నది, భూసేకరణ చేసిందీ జగన్మోహన్ రెడ్డి గారు. కొబ్బరి కాయ కొడితే లక్ష ఉద్యోగాలు వస్తాయా చెప్పండి. స్టీల్ ప్లాంట్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పండి ? తుని, పాయకరావు పేట వారికి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పండి. ఈ మ్యానిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇవ్వరు కానీ 20 లక్షల ఉద్యోగాలు అని పదే పదే అబద్ధాలు చెప్తున్నారు. వీటిని ప్రశ్నిస్తే ఎప్పుడో 27 ఏళ్ల క్రితం చనిపోయిన రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అని ఎదురుదాడి. ఆయన్ను చంపిన వారు టీడీపీ వారు కాదా ? వాళ్లను టీడీపీ ఆఫీసులో తీసుకెళ్లి దాచింది మీరు కాదా ? రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తుచేస్తే మీకే ప్రమాదం. ఎందుకంటే ఆయన్ను గుర్తుచేస్తే ఉఛిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ గుర్తుకొస్తాయి. కాబట్టి మీకే నష్టం తప్పదు. వివేకానందరెడ్డి గారిని హత్య చేసిన దస్తగిరికీ, చంద్రబాబుకూ ఒకరే లాయర్. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన హత్యే అది. మాకు మీడియా, సోషల్ మీడియా ఉంది కాబట్టి తిమ్మిని బమ్మి చేయగలగమని అనుకుంటున్నారు. హత్య చేసిన వ్యక్తిని మీ పక్కన బెట్టుకుని మా మీద నిందలు వేస్తారు. వంగవీటి రంగా హత్య గురించి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ కేబినెట్లో అప్పట్లో మంత్రిగా ఉన్న హరిరామ జోగయ్య సహా ఎంతో మంది మీవైపే వేలు చూపించారు. విజయవాడలో పేదల ఇళ్ల కోసం నిరాహార దీక్ష చేస్తుంటే మతాన్ని అడ్డుపెట్టుకుని నల్ల బట్టల్లో వచ్చి రంగా గారిని హత్య చేశారు. ఈ హత్యకు కారకుడైన వెలగపూడి రామకృష్ణబాబును మీ పార్టీలో ఉంచుకుని మా మీద ఎదురుదాడి చేస్తారు. మీకు వీడ్కోలు బటన్ నొక్కడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్దంగా ఉన్నారని దాడిశెట్టి రాజా చంద్రబాబుకు చురకలు అంటించారు.

Back to Top