చంద్రబాబు చొక్కా పట్టుకొని పవన్‌ ఏనాడైనా నిలదీశారా?

మాజీ మంత్రి పేర్ని నాని

పవన్‌ నిజాయితీపరుడైతే వారాహీ కాదు..నారాహి అని పెట్టుకోవాలి

రోజుకొక డైలాగ్‌ చెప్పి పవన్‌ వ్యూహం అంటారు

పవన్‌ ఒక్క చెప్పు చూపిస్తే నేను రెండు చెప్పులు చూపిస్తా

పవన్‌ డ్రామాలు వేస్తే మక్కెలిరగదీస్తాం

పదేళ్ల నుంచి పవన్‌ పార్టీని చంద్రబాబే నడుపుతున్నారు

వైయస్‌ జగన్‌ జనం సొమ్ము జనానికే పంచుతున్నారు

తాడేప‌ల్లి: చంద్రబాబు చొక్కా పట్టుకొని పవన్ క‌ల్యాణ్ ఏనాడైనా నిలదీశారా? అని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి పేర్ని నాని  ప్ర‌శ్నించారు. పవన్‌ నిజాయితీపరున్ని అని చెప్పుకుంటున్నారు.. ఆయ‌న వారాహీకి నారాహీ అని పెట్టుకుంటే బాగుండేది.  నిన్నమీటింగ్‌లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. గురువారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

అది వారాహి కాదు ‘నారాహి’:
చంద్రబాబు భాగస్వామి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తన రాజకీయం కంటే తన లారీ మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లున్నారు. 
ఆ లారీకి కొండగట్టు, బెజవాడ కనకదుర్గమ్మ, అన్నవరం, పార్టీ ఆఫీసులో పూజ చేశారు. హోమం కూడా చేశారు. 
మనలో సరుకుండాలే కానీ ఈ లారీకి పూజేంటో అర్ధం కాలేదు. 
వారాహి అని అమ్మవారి పేరు పెట్టి రాజకీయాలకు వాడుకోవడం ఏంటో అర్ధం కాదు. 
నిజాయితీగా మాట్లాడితే ఆ లారీకి పెట్టాల్సిన పేరు ‘నారాహి’
తన ప్రసంగంలో బోణీగా గతంలో నేను మాట్లాడిన ప్రసంగాలు వింటుంటే తనకే ఆశ్చర్యమేసిందట.
నిజమే కదా..పూటకో మాట మాట్లాడి, నిన్న మాట్లాడిన దానికి వ్యతిరేకంగా నేడు మాట్లాడుతుంటాడు. 
నీ స్పీచ్‌లు నీకే ఆశ్చర్యమేస్తే ఇక ప్రజలకెంత ఆశ్చర్యమేస్తుందో ఆలోచించండి. 

బాబు, మోడీల చొక్కాలు ఎన్నిసార్లు పట్టుకున్నావ్‌ పవన్‌ కళ్యాణ్‌..?:
ఏతా వాతా ఆయన వ్యూహం ఏంటంటే చంద్రబాబు బాగుండాలి. 
చంద్రబాబు పచ్చగా కళకళలాడాలి. దాని కోసం ఏమైనా చేస్తాడు. 
పాలించే నాయకులకు గులాంగిరి చేయను...బాధ్యతగా లేనప్పుడు చొక్కా పట్టుకుని అడుగుతా అంటున్నారు. 
మరి చంద్రబాబు గారి చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నావ్‌..నరేంద్ర మోడీగారి కోటు ఎన్ని సార్లు పట్టుకున్నావ్‌
నరేంద్ర మోడీగారి ఓటేయమని నువ్వు చెప్పి తొమ్మిదేళ్లయ్యింది...ఈ తొమ్మిదేళ్లలో మోడీ చేసిన పొరపాటు పనులకు ఎన్నిసార్లు కోటు పట్టుకున్నావ్‌..? 
చంద్రబాబు గంజిపెట్టిన చొక్కాను ఎన్నిసార్లు పట్టుకున్నావ్‌. 
చంద్రబాబు చొక్కా నలిగిపోవడం ఏనాడూ నేను చూడలేదు. 
అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేనప్పుడు కానీ ఒక్క రోజు చంద్రబాబు చొక్కా పట్టుకున్న దాఖలాలు లేవు. 
ఆయనది గంజిపెట్టిన చొక్కా కదా..నలిగిపోవాలి కదా..? 
క్షమించాలి...పవన్‌ కళ్యాణ్‌ గారిని నిన్ను అని ఏకవచనంతో మాట్లాడాను..
వంతాడలో చంద్రబాబు లేటరైట్‌ పేరుతో అల్యూమినియాన్ని దోచుకున్నాడని మీరే చెప్పారు. 
జగన్‌ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విచారణ చేయిస్తానన్నారు..ఇంతవరకూ ఆ విచారణ రిపోర్టు బయట పెట్టలేదు అని అన్నారు. 
మరి చంద్రబాబు అల్యూమినియాన్ని దోచుకున్నపుడు ఆయన చొక్కా పట్టుకున్నారా..? 
అప్పుడు కుదరలేదు సరే...ఈ మధ్య ఇద్దరూ కలుసుకుంటున్నారు కదా..అప్పుడన్నా పట్టుకున్నావా..? 
పవన్‌ కళ్యాణ్‌ ఎన్ని సొల్లు కబుర్లు చెప్తాడు అని ప్రజలకు తెలియడం కోసం ఇవన్నీ చెప్తున్నా.

మాకూ రెండు చెప్పులున్నాయ్‌..మక్కెలు విరగగలవ్‌ జాగ్రత్త..:
నువ్వు చెప్పు చూసిస్తే మక్కెలు ఇరిగిపోవడానికి ఇదేమన్నా సినిమానా..? మడిసి తొంగోబెడతారు.
నువ్వు పెద్ద మగోడివా...మాట మాటకీ చెప్పు చూపించానని చెప్పుకుంటున్నావు. 
పవన్‌ కళ్యాణ్‌ నేను రెండు చెప్పులు చూపిస్తున్నా..ఇప్పుడు నీకన్నా పెద్ద మగాడిని కదా..
రెండు చెప్పులు...జాగ్రత్త..మక్కెలిరిగిపోతాయ్‌...
ఈ బుస మాటలు, సినిమా డైలాగులు, సొల్లు కబుర్లు ఆపు.
నీకొక్కడికేనా చెప్పులు...మాకూ ఉన్నాయ్‌...నీకు ఇరగవా మక్కెలు..?
పదేళ్లుగా నేనొక్కడినే జనసేనను నడుపుతున్నాను అంటున్నాడు...ఆ పార్టీని నడుపుతున్నది చంద్రబాబు కదా..? 
ఆఫీసు స్థలం ఎవరిచ్చారు..రేటెంత..అనేది ప్రపంచానికి తెలియదా..? 
2014లో నువ్వు పోటీ చేయవద్దని, నువ్వు పోటీ చేస్తే నేను ఓడిపోతానని చంద్రబాబు అన్నాడని నువ్వే చెప్పావు కదా. 
ఆనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో పవన్‌ మొట్టుదిగాడు..డబ్బులు అడిగాడు అని రాశారని చెప్పింది నువ్వే కదా..
పదేళ్ల నుంచి పార్టీని నడుపుతున్నదెవరు..చంద్రబాబేగా.
చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు కొరకై నిన్ను అడ్డం పెట్టి నడుపుతున్న పార్టీ జనసేన అనేది చిన్నపిల్లాడ్ని అడిగినా చెప్తాడు. 

జన్మభూమి కమిటీల్లాంటి బ్రోకర్‌ కమిటీలు లేకుండా జనం సొమ్ము జనానికే:
జగన్‌గారు బటన్‌ నొక్కుతున్నాను అంటున్నాడు..ఆయన సొంత డబ్బులు ఇవ్వడం లేదుగా అంటున్నాడు. 
చంద్రబాబు, బీజేపీ, పవన్‌ కళ్యాణ్‌ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని నడిపారు. 
ఆనాడు నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు..నేనిచ్చిన గ్యాస్‌ మీద వంట వండుకుంటున్నారు అని చంద్రబాబు అన్నాడు. 
చంద్రబాబు ఈ మాటలు మాట్లాడినప్పుడు ఎక్కడికెళ్లావ్‌ పవన్‌ కళ్యాణ్‌..? 
లంచాలకు తావు లేకుండా, జన్మభూమి కమిటీల్లాంటి బ్రోకర్‌ కమిటీలు లేకుండా జనం సొమ్ము జనానికే ఇస్తున్నానని జగన్‌ గారు చెప్తున్నారు. 
పవన్‌ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ కలిసిన ఉన్న ప్రభుత్వంలోని దగుల్భాజీ కమిటీల్లా దోచుకునే పరిస్థితి లేకుండా చేశారు. 
నేనిచ్చాను డబ్బులు అంటూ చంద్రబాబు చెప్పినప్పుడు నీ నోరేమైంది పవన్‌ కళ్యాణ్‌..?

కేసీఆర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది నువ్వు కాదా పవన్‌ కళ్యాణ్‌...?:
తెలంగాణ వారి చేత ఆంధ్రా కొడకల్లారా అని తిట్టించుకున్నా కూడా పౌరుషం రాకపోవడం బాధాకరం అని కుర్రాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.  
కేసీఆర్‌ చంక నాకుతున్నది ఎవరు..? కేసీఆర్‌ కాళ్ల దగ్గర కూర్చుని టిక్కెట్ల రేట్లు పెంచు..బ్లాకులో అమ్ముకుంటాను అని కాళ్లు చేతులు పిసుకుతున్నది ఎవరు..? 
బీజేపీతో బంధం ఉంచుకుని..కేసీఆర్‌తో అక్రమసంబంధం పెట్టుకుని, ఆయనకు ఓట్లు వేయమని చెప్పినోడు ఎవడు..? 
గులాబి జెండాని బ్యాక్‌ పాకెట్‌లో పెట్టుకుని హైదరాబాద్‌లో తిరుగుతున్నది ఎవడు..? 
హరీష్‌రావు ఆంధ్రప్రదేశ్‌ను, ఇక్కడ ప్రజలను అవమానకరంగా మాట్లాడుతుంటే...తిరిగి తిడుతుంటే ఆయనపై ఈగ వాలకుండా వచ్చేస్తున్నది ఎవరు..? 
ఇవన్నీ చేస్తున్నది...ఈ సొల్లు కబుర్లన్నీ చెప్తున్నది పవన్‌ కళ్యాణ్‌..
హైదరాబాద్‌లో బతుకుతుంటే ఒక మాట మాట్లాడతాడు...ఇక్కడికి వచ్చినప్పుడే ఆంధ్రా కొడకల్లారా అన్నది గుర్తుకువస్తుంది. 
మరి నువ్వు రోజూ వాళ్ల దగ్గరకు వెళ్లి ఎందుకు కూర్చుంటున్నావ్‌...?
హరీష్‌రావును ఏం అనొద్దు..ఆయన ఇరిగేషన్‌ మంత్రి అంటూ ఎందుకు చెప్తావు..? 
ఆయన ఎవడికి పెద్ద..నా నేలని, నా గడ్డని అన్నాక ఎవడికి పెద్ద..?

నీ సినిమాలకు జగన్‌ గారు బస్సులు పెట్టి జనాన్ని తోలాలా..?:
నా సినిమాలను ఆపాలని చూస్తున్నారు...సినిమా టిక్కెట్లపై ఆదాయం సంపాదించుకోవాలని నేను అనుకోలేదు అని పవన్‌ కళ్యాణ్‌ చెప్తున్నాడు. 
అసలు ఏ సినిమా నీది ఆగిందో చెప్పండి..ఏ సినిమాకు బ్లాక్‌లో మీరు టిక్కెట్లు అమ్ముకోలేదో ఒక్కటి చెప్పండి. 
మీ ఇష్టం వచ్చిన సినిమా పేరు చెప్పండి...ఆగిందని..? 
2019లో జగన్‌ గారు ముఖ్యమంత్రి అయ్యాక మీవెన్ని సినిమాలు వచ్చాయో చూడండి. 
2019 తర్వాత ఈ పనిమంతుడివి వచ్చినవి రెండు సినిమాలు 
బీమ్లానాయక్, వకీల్‌ సాబ్‌ తప్ప ఏం వచ్చాయ్‌..? 
ఈ రెండు సినిమాలను ఎవడు ఆపాడు...? సినిమా బాగుండాలి..
సినిమా బాగా తీయకుండా..సినిమా ఆడాలంటే ఎలా..?
జగన్‌ గారు బస్సులు పెట్టి ఈయన సినిమాలకు జనాన్ని తోలాలా..? 
మీ ప్రభుత్వం నడిచినప్పుడు కూడా సినిమా టిక్కెట్లపై జీఎస్టీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ టాక్స్‌ ఉన్నాయి కదా..

ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి అదేమన్నా దానమా..?:
ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాను అంటున్నాడు..ఎవరన్నా ముఖ్యమంత్రి పదవిని దానం చేస్తారా..? 
గోదానం, భూదానంలా ముఖ్యమంత్రి పదవి దానం చేయాలంటున్నాడు. 
నేడు శ్రీశ్రీ గారి వర్ధంతి...‘ఏదీ తనంతట తానే నీ దరికి రాదు..శోధించి, సాధించాలి..అదే ధీరగుణం’ అని శ్రీశ్రీ అన్నారు. 
ఈ గుణం జగన్‌ గారిది...ఈ మాటలు జగన్‌ గారికి సరిగ్గా సరిపోతాయి.
కానీ పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఎవడన్నా దానం చేస్తాడేమోనని అడుక్కుంటున్నావు. 
చంద్రబాబుతో సావాసం చేస్తే ఈ రకంగా దిగజారి చెడిపోవడం తప్ప ఏమీ ఉండదు. 
ప్రజల్ని నమ్ముకుంటే అసెంబ్లీకి వెళ్తారు కానీ..వ్యూహాన్ని నమ్ముకున్నోడు ఎవరూ వెళ్లరు...
మన పవన్‌ కళ్యాణ్‌ వ్యూహాలను నమ్ముకుని అసెంబ్లీ గేటు కూడా తాకలేడు. 
వ్యూహాలను నమ్ముకుంటే చిల్లరొస్తుంది కానీ...అసెంబ్లీలో సీటు రాదు. 
ఇది తెలుసుకుంటే ఎప్పటికైనా నువ్వు అసెంబ్లీకి వెళ్లగలవు. 
ప్రజల్ని నమ్ముకుంటేనే పవన్‌ కళ్యాణ్‌ కానీ, పేర్ని నానీ కానీ ఎవరైనా అసెంబ్లీలోకి వెళ్లగలరు. 
వ్యూహాలను, చంద్రబాబుని నమ్ముకుంటే నీ జేబు మాత్రమే బలపడుతుంది. 

మీ పిల్లల్ని మాట్లాడేంత నీచానికి మేం ఒడికట్టం:
ఇసుక దోపిడీ అని నేను అడిగినప్పటి నుంచీ నా మీద దాడి పెరిగింది. 
నా ఇంటి వరకూ వచ్చారు..ఆఖరుకు నా ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా వదలేదు అంటున్నాడు. 
ఎంత నీచంగా మాట్లాడతున్నావ్‌...పవన్‌ కళ్యాణ్‌..
మేం మీ ఇంట్లో వారిని, మీ పిల్లల్ని మాట్లాడేంత నీచానికి మేం ఒడికట్టం. 
రాజకీయాల కోసం, చంద్రబాబు కోసం ఇంత దిగజారడం అవసరమా పవన్‌ కళ్యాణ్‌..? 
కాపు సోదరుల్లో సానుభూతి సంపాదించాలని కొత్త డ్రామాకు తెరలేపుతున్నాడు. 
మీరు నా తల్లిని అవమానించారు..లోకేశ్‌ని, తెలుగుదేశం పార్టీని క్షమించను..ఖబడ్దార్‌ అన్నది మీరే కదా పవన్‌ కళ్యాణ్‌
వారికి తొత్తుగా మారి మళ్లీ వారితోనే ఆయన తిరుగుతున్నాడు...
వారి కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు వాళ్ల ఇంట్లోకి వచ్చి వారి పిల్లల గురించి మాట్లాడుతున్నాంటూ నీచమైన ఆరోపణలు చేస్తున్నాడు. 

చంద్రబాబు కోసం ఎంతకైనా బరితెగింపు:
బీమవరంలో లక్ష ఓట్లు ఉంటే..ఒక లక్ష 8 వేల ఓట్లు పోలయ్యాయట..
అందుకే తాను ఓడిపోయాను..అంటున్నాడు. నా మీద అంత కక్షకట్టారని బాధపడుతున్నాడు. 
భీమవరంలో 2019లో మొత్తం 2,46,342 ఓట్లు ఉంటే వాటిలో 1,92,061 ఓట్లు పోలయ్యాయి. 
గ్రంధి శ్రీనివాస్‌కు వచ్చిన ఓట్లు 70,642, పవన్‌ కళ్యాణ్‌కు వచ్చిన ఓట్లు 62285, టీడీపీకి 54037, నోటా 1492 ఓట్లు వచ్చాయి. 
మొత్తం 77–78 శాతం ఓట్లు పోలయ్యాయి.
పవన్‌ కళ్యాణ్‌కి 62285 ఓట్లు వస్తే...అదే పార్లమెంటులో పోటీ చేసిన నాగబాబుకు బీమవరంలో వచ్చిన ఓట్లు 50067 ఓట్లు మాత్రమే. 
పవన్‌ కళ్యాణ్‌కి వచ్చిన ఓట్లు కూడా నాగబాబుకు రాలేదు. 
చంద్రబాబు కోసం ఎంత బరితెగించాలో అంతగా బరితెగిస్తున్నాడు. 

రంగాను చంపిన రక్తం చేతులకు అంటించుకున్న వారితో చేతులు కలిపింది నువ్వేగా పవన్‌:
చిన్నానను చంపి రక్తం చేతులకు అంటించుకున్న వ్యక్తిని మీరు సీఎంగా చూస్తారా అంటున్నాడు. 
మొన్నటి వరకూ పనిచేసిన ఒక సీబీఐ డైరెక్టర్‌ ఉన్నారు. ఆయనకు ఆ పదవి రావాడానికి కారకుడైన ఒక లోడెత్తే వ్యక్తి ఉన్నాడు. 
వారితో ప్రభావితమే..దర్యాప్తు తప్పుడు దారిలో వెళ్తున్న సమయంలో ఈ చెత్త మాటలు మాట్లాడటం సరైనదేనా..? 
ప్రతి కాపు, తెలగ, బలిజ బిడ్డా వారి ఆరాద్య నాయకుడిగా, హీరోగా భావించే వంగవీటి మోహనరంగాను చంపి రక్తం చేతులకు అంటించుకున్న వాడితో చేతులు కలిపినప్పుడే ఆ రక్తపు మరకలు నీ చేతికి అంటాయి కదా..? 
ఇక ఏ రకంగా మీరు మా కులానికి పెద్ద దిక్కు అవుతారు..? 
మూడు పదుల వయసులో తను నమ్మిన సిద్ధాంతం కోసం చావుకు ఎదురెళ్లి ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వ్యక్తి చేగువీరా
వాళ్లు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి అతివాద ఉద్యమం చేసిన వ్యక్తులు భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురూలు.
వారి స్ఫూర్తి ఏదీ నీలో..? నీకు చే అంటే...చంద్రబాబు. 
వారిదేమో రాజీలేని అతివాద గెరిల్లా పోరాటం అయితే..నీది ఫక్తు లాలూచీ ప్రయాణం
నిజంగా చేగువీరా, భగత్‌ సింగ్, సుఖదేవ్, రాజ్‌ గురూల ఆత్మలు ఘోషిస్తాయి.
వీడెవడు..మమ్మల్ని మార్కెటింగ్‌ చేసుకుంటున్నాడని బాధపడతారు. 

రిజిస్ట్రార్‌ ఆఫీసులో రేషన్‌ కార్డులు ఇస్తాడట..:
జనసేన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాడట. 
పెళ్లి చేసుకున్న ప్రతివారికి రిజిస్ట్రార్‌ ఆఫీసులో రేషన్‌ కార్డు ఇస్తాడట..
అసలు బీపీఎల్‌ లిమిట్‌ లేదట..? అసలు రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లి పెళ్లి చేసుకునేది ఎంతమంది..?
మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్‌ కార్డులెన్ని..? జగన్‌ గారు వచ్చిన తర్వాత రేషన్‌ కార్డులెన్ని..? 
దరఖాస్తు పెట్టుకుంటే ప్రతి ఆరు నెలలకోసారి రేషన్‌ కార్డులు మంజూరు జరుగుతోంది. 
మీకు ఇక్కడ ఓటూ లేదు..ఏ సచివాలయంలో మ్యాపింగ్‌ జరగలేదుగా.?
మీదంతా హైదరాబాద్‌ వ్యాపారం కదా..? లేదంటే సచివాలయానికి వెళ్లి రేషన్‌ కార్డు దరఖాస్తు చేసుకోడానికి..

ముఖ్యమంత్రి కావాలంటే ముందు సగం సీట్లు రావాలి పవన్‌ కళ్యాణ్‌..:
జనసేన ప్రభుత్వం రావాలి అంటే పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. 
ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయాలంటే 175లో సగం మంది  ఎమ్మెల్యేలు గెలవాలి. 
మా కులస్తులను పవన్‌ కళ్యాణ్‌ ఎంత మోసం చేస్తున్నాడో ఒక్క సారి గమనించాలి. 
జనసేన పార్టీకి పొత్తులు ఉంటాయి...ఉండి తీరుతుంది..
దీన్ని ఎవరన్నా వద్దనుకుంటే నాకు తెలియదు కానీ నేనైతే సంసిద్ధంగా ఉన్నాను అని గతంలో పవన్‌ అన్నాడు. 
48 నుంచి 50 శాతం ఓటింగ్‌ లేకుండా మనకు సీఎం అయ్యే హక్కు మనకు లేదు అని ఆనాడు అన్నాడు. 
ఇప్పుడు మళ్లీ జనసేన ప్రభుత్వం వస్తుందంటున్నాడు. 
ముగ్గురు కలిసి పోటీ చేస్తారట..నేను సీఎం కాదు చంద్రబాబే సీఎం అంటాడు. 
మరో పక్క జనసేన ప్రభుత్వం వస్తే ఇవన్నీ కొనసాగిస్తాను అంటాడు. 
అమాయకపు కాపు కుర్రోళ్లను మోసం చేస్తున్నాడు. 
చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేద్దాం అంటే ఈయన ఆఫీసులో చూపించినవి జతలకొద్దీ వచ్చీ నారాహీపై పడతాయి. 
చంద్రబాబుతో కలిసి వెళ్తున్నాం...వాళ్లు మనకో 15 సీట్లు ఇస్తారు అని చెప్పే ధైర్యం పవన్‌ కళ్యాణ్‌కు లేదు. 
చంద్రబాబే ముఖ్యమంత్రి అని చెప్పే దమ్ము ధైర్యం లేదు కానీ..పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. 
నిత్యం నాఅంత దమ్మున్న నాయకుడు లేడు అంటాడు..ఇదీ ఆయన దమ్ము ధైర్యం.

ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు 5శాతం ఇవ్వగలమా..?:
కాపు గడ్డపై జగన్‌ గారు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేనని చెప్పినా అతనికే ఓట్లు వేశారు అంటున్నాడు. 
కులరహిత సమాజం కోరుకుంటున్న వారిలో నేను ప్రథముడిని అంటాడు. 
2014లో కుల రహిత సమాజం అంటాడు..2019లో నేను రెల్లి కులస్థుడిని అంటాడు..2024కి వచ్చే సరికి నేను కాపు కులస్థుడిని అంటాడు. 
2014లో చంద్రబాబు, బీజేపీ, పవన్‌ కళ్యాణ్‌ కలిసి కాపులను బీసీలుగా చేస్తామని ఓట్లేయించుకున్నారు కదా..? 
మరి వారిని బీసీలుగా చేశారా..? చేయకపోగా మోసం చేసి ఈ రోజు మాట్లాడుతున్నాడు. 
5 శాతం రిజర్వేషన్లను చంద్రబాబు ఇద్దామనుకుంటే జగన్‌ ఇవ్వట్లేదు అంటున్నాడు. 
కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక వెనుకబాటులో ఉన్న వారికి 10 శాతం రిజర్వేషన్‌ ఇచ్చింది. 
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం దాంట్లో కాపులకు విడిగా 5 శాతం రిజర్వేషన్‌ ఇవ్వగలరా..?
నువ్వు చంద్రబాబు కలిసి కాపులను బీసీలుగా చేస్తానని చెప్పి మోసం చేసినట్లే మళ్లీ మరొక మోసం కాదా ఇది..? 
కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే, ఎవడో రైళ్లు తగులబెడితే కాపులను వేదించారు. 
వందల మంది కాపులను ముద్దాయిలుగా పెట్టి ఎంతో వేదించారు. 
ముద్రగడ కుటుంబాన్ని వేదించారు...కాపులపై కేసులు పెట్టారు. 
అప్పుడు నువ్వేం చేశావ్‌...ఎక్కడున్నావ్‌ పవన్‌ కళ్యాణ్‌..? 

చంద్రబాబు మోసగాడైతే...పవన్‌ కళ్యాణ్‌ గజమోసగాడు..!:
ఈ రోజు వచ్చి బీసీలకు ఇసుక ఇస్తాను అంటున్నాడు...వారి చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు...? 
ఆనాడు ఎమ్మెల్యేలకు, నాయకులకు ఎందుకిచ్చారు..? 
అధికారంలో ఉంటే ఒక మాట..అధికారంలో లేకపోతే మరొక మాట...
నా ప్రభుత్వం వచ్చిన తర్వాత తాట తీస్తా..కింద నేలపై కూర్చోబెడతా అంటున్నాడు. 
రావయ్యా పవన్‌ కళ్యాణ్‌...నేను చాలెంజ్‌ చేస్తున్నా...
నా జన్మంతా ఎదురుచూస్తా...నీకు చేతనైనది చేయ్‌.. 
నా ఊపిరి ఉన్నంత వరకూ నీకు వ్యతిరేకంగానే ఉంటా..నీకు చేతనైంది చేయ్‌ పవన్‌ కళ్యాణ్‌. 
నేల మీద కూర్చోబెట్టడం, తాట తీయడం..ఇవేమీ సినిమా డైలాగులు కావు. 
కనీసం నా వెంట్రుక కూడా పీకలేవు..రాస్కో పీకే..
నేను బతికున్నంత వరకూ నీ తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటా..
ఏం చేస్తావో చెయ్‌...
లారీ ఎక్కి సర్కస్‌ చేస్తూ మోసపూరిత మాటలు చెప్తున్న పవన్‌ కళ్యాణ్‌ని అందరూ గమనించండి.
నా కాపు సోదరులంతా తస్మాత్‌ జాగ్రత్త.

నిన్ను అసెంబ్లీకి వెళ్లకుండా ఆపేది ప్రజలే:
నిన్ను అసెంబ్లీకి వెళ్లకుండా ఆపేది ప్రజలే..వాళ్లు నీకు ఓటెయ్యాలి కదా..? 
చిరంజీవి గారిని ఎవరన్నా అసెంబ్లీకి వెళ్లకుండా ఆపారా..? 
ఆయన ప్రజల్ని నమ్ముకున్నాడు..అసెంబ్లీకి పంపించారు. 
చంద్రబాబును నమ్ముకుంటే జనమే ఆపేస్తారు..
పవన్‌ కళ్యాణ్‌ జీవితం అంతా హాస్యాస్పదం.. పరస్పర విరుద్ధ ప్రకటనలే కదా..
తెరమీద చిరంజీవి తమ్ముడిగా, హీరోగా కనిపిస్తుంటాడు...రాజకీయాల్లోకి వచ్చి ఒక కమేడియన్‌లా కనిపిస్తుంటాడు. 
2018లో పవన్‌ కళ్యాణ్‌ అమరావతి అనేది కొంత మంది కమ్మవారి, డబ్బున్న వారి గేటెడ్‌ కమ్యూనిటీ అన్నాడు. 
ఇప్పుడు అమరావతే రాజధాని అంటున్నాడు.  ఆయన నోటికి శుద్ధి ఉండాలి..

Back to Top