26 నెలల్లో పోర్టు పనులు పూర్తిచేస్తాం

మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని

కృష్ణా: మచిలీపట్నం పోర్టు పనుల్లో మరో ముందడుగు పడింది. నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ నిర్మాణ పనులకు మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. సౌత్, నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ పనులను సమాంతరంగా పూర్తిచేస్తామన్నారు. నాలుగు బెర్త్‌ల నిర్మాణానికి సంబంధించి సాయిల్‌ టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. మొన్నటి వరకూ దావాలతో ఇబ్బంది పెట్టారని, అన్ని ఇబ్బందులను అధిగమించి మచిలీపట్నం పోర్టు పనులను ప్రారంభించుకున్నామన్నారు. 26 నెలల్లో పోర్టు పనులు పూర్తిచేస్తామని పేర్ని నాని చెప్పారు. 
 

Back to Top