బాబు కుటుంబంలోనే సర్టిఫైడ్ సైకోలు 

రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే అని గూగుల్‌ని అడిగినా చెప్తుంది

2019లో జనం చితక్కొట్టినా మళ్లీ వస్తున్నాడు

ప్రజల గుండెల్లో సీఎం వైయ‌స్‌ జగన్‌ ఏనాడో స్టిక్కర్‌ వేసుకున్నారు

చంద్ర‌బాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ మరణమే.. 

చంద్రబాబుకు అసలు పోలవరం గురించి మాట్లాడే అర్హత లేదు

పచ్చ మీడియా ఉంది కాబట్టి తండ్రీ కొడుకుల ఆటలు సాగుతున్నాయి

"మమ్మల్ని క్షమించండి".. అని అయ్యకొడుకులు యాత్రలు చేయండి

చంద్ర‌బాబు, లోకేష్‌పై మాజీమంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ఫైర్‌

కాకినాడ‌: రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబేన‌ని గూగుల్‌ని అడిగినా చెప్తుంద‌ని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు. నారా లోకేష్‌ పెద్ద ఐరన్‌ లెగ్‌ అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. గుంటూరు, కందుకూరులో అమాయకులను చంద్ర‌బాబు పొట్టనబెట్టుకున్నాడ‌ని గుర్తుచేశారు. రాష్ట్రానికి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంద‌ని చెప్పారు. ప్రతీ పేదవాడి గుండె చప్పుడు సీఎం వైయ‌స్‌ జగన్‌ వింటున్నారు. కాకినాడ‌లో మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా కురసాల కన్నబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..

చంద్రబాబునాయుడు మళ్లీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ని శాపనార్ధాలు పెట్టుకుంటూ రోడ్లపై తిరుగుతున్నాడు.  2019లో జనం బాదిన దెబ్బకి దిక్కు మొక్కు లేకుండా, మైండ్‌ బ్లాంక్‌ అయ్యి ఇప్పటికీ తేరుకోలేక తండ్రీ కొడుకులు రోడ్లపై తిరుగుతున్నారు. ఐదేళ్లు అవకాశం ఇస్తే..మోసం చేశాం అని క్షమాపణలు కోరి తిరిగితే బాగుండేది. తిట్ల దండకం అందుకుని సీఎం వైయ‌స్ జగన్‌ను తిడితే మీకేమీ రాదు. మీరు చేసిన దరిద్రపుగొట్టు పాలనను ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఆ రోజు బాదితే ఈరోజుకీ మీరు తేరుకోలేదు.. చంద్రబాబుకి దేవుడు మతిమరుపు అనే గొప్ప వరం ఇచ్చాడు. ఆయన ఐదేళ్ల పరిపాలనలో ఏం చేశాడో గుర్తులేక ఇవాళ జగన్‌ గారికి శాపనార్ధాలు పెడుతున్నాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటున్నాడు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే అని ఆయన మామగారు, ఆయన కుటుంబ సభ్యులే చెప్పారు. ఆయనే దరిద్రం ఈ రాష్ట్రానికి అని.. ఆయన కుటుంబ సభ్యులతో పాటు 80 శాతం మంది ప్రజలు సర్టిఫికెట్‌ ఇచ్చి ఉంటారు. 2019లో ఈ దరిద్రాన్ని వదిలించుకోడానికే జనం ఛీ కొట్టారు..అయినా ఆయనకు బుద్ధి రాలేదు

మీ పాదం మోపితే మరణమే కదా..
సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రజలకి అదృష్టం.. చంద్ర‌బాబు మాత్రమే దరిద్రం. దరిద్రమెవరో అదృష్టం ఎవరో ప్రజలకు తెలుసు కాబట్టే వైయ‌స్‌ జగన్‌ని గుండెల్లో పెట్టుకుంటున్నారు. చంద్రబాబు కుమారుడి గురించి ప్రజలు ఈయనో ఐరెన్‌ లెగ్‌ అనుకుంటున్నారు. లోకేశ్‌ పార్టీ పగ్గాలు తీసుకున్నాకే కదా మొత్తం నాశనం అయ్యింది. మొన్నటి కందుకూరు తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు..గుంటూరులో ముగ్గురు చనిపోయారు. ఈయన ఎక్కడ పాదం మోపితే అక్కడ చనిపోతున్నారు..రాష్ట్రంలో అదే పెద్ద దరిద్రం. సీఎంగా వైయ‌స్ జగన్ వచ్చినప్పటి నుంచి సకాలంలో వానలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది.  పుష్కరాల్లో ఈయన స్నానం సరదాకి 29 మంది చనిపోవడాన్ని దరిద్రం అనే అంటారు. కష్టంలో బాధల్లో కన్నీళ్లలో ఉంటే తుడిచి ఆదుకునే వైయ‌స్ జ‌గ‌న్‌ని అదృష్టం అంటారు. బాబే పెద్ద దరిద్రం అని ప్రజలు అర్ధం చేసుకున్నారు కాబట్టే 2019లో తిరిగి లేవకుండా కొట్టారు. 

2019 తర్వాత ఏ ఒక్క  ఎన్నికైనా మీరు గెలిచారా..?. మీ దరిద్రం ఇంకా పట్టిపీడిస్తుంది కాబట్టే కనిపించిన ప్రతి ఒక్కరికీ కన్ను కొట్టి పొత్తు కు రమ్మంటున్నావ్‌. ఓ పక్క పవన్‌ కళ్యాణ్, మరో పక్క కమ్యూనిస్టులను, బీజేపీని అందర్నీ ఒకే చోటకు రమ్మని పిలుస్తున్నావ్‌. బలమున్న వాడెవడైన మేం ఒంటరిగా వస్తాను అంటాడు.. కానీ కట్టకట్టుకుని మందలా వస్తాను అంటున్నావు అంటే ఎవరికి దరిద్రం పట్టిందో తెలుసుకో..!. ఐదేళ్ల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని సంవత్సరాలు రాష్ట్రానికి కరువు వచ్చిందో గుర్తు చేసుకో చంద్రబాబూ..! సుభిక్షంగా వానలు కురుస్తూ వైయ‌స్ జగన్ ప‌రిపాలనలో అదృష్టం కలిసి వస్తోంది. 

పోలవరం సకాలంలో పూర్తి కాకపోవడానికి కారణం బాబే..
పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్ర‌బాబుకు ఉందా...?. రాత్రికి రాత్రి పోలవరం మేమే కడతామని కేంద్రంతో కుమ్మక్కు అయ్యి కాంట్రాక్టు కోసం పర్సెంటేజీల కోసం కాళ్లావేళ్లా పడి తెచ్చుకున్నావ్‌. రాత్రికి రాత్రి స్వీట్లు పంచుకున్నావ్‌.. ఆనాడు 2013–14 రేట్లలో సుమారు 28 వేల కోట్లకు కడతానని ఒప్పుకుని పోలవరానికి అన్యాయం చేశావ్‌. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వచ్చిన తర్వాత ఇది సాధ్యం కాదని, తప్పులు తడకగా పోలవరం నిర్మాణం సాగుతుందని చెప్పారు. రివైజ్డ్‌ ఎస్టిమేట్లు ఇవ్వండి.. 2017–18 అంచనాలు ఇవ్వాలి. 55 వేల కోట్ల పైచిలుకు రావాలని పోరాడుతున్నది నిజం కాదా..? ప్రాజెక్టులకు నిపుణులు డిజైన్‌ చేస్తారు.. కానీ చంద్రబాబు వాళ్ల పనిని కూడా చేయనీయలేదు. ముందు స్పిల్‌ వే కట్టాలి..ఆ తర్వాత ఎర్త్‌ ఫిల్‌ రాక్‌డ్యాం, కాఫర్‌ డ్యాం కట్టాలి. ఈయన చేసిన నిర్వాకానికి ముందు కాఫర్‌ డ్యాం కట్టాడంతో .. వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. ఎందుకు మట్టి పనులపై ఆయనకు శ్రద్ధ..?.  సగం నిర్మాణం  పూర్తయ్యాక నాలుక కరుచుకుని మట్టికట్టలు వేస్తే గోదారి వెనక్కి తన్ని ముంపు గ్రామాలు మునిగిపోతాయని, వారికి పరిహారం కూడా ఇవ్వలేదని గుర్తొచ్చి మధ్యలో ఆపేశాడు. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవడానికి కారణం చంద్రబాబే. మళ్లీ ఇప్పుడు వచ్చి తగుదనమ్మా అంటూ పండుగలు పబ్బాలు వదులుకుని నేను పోలవరం కోసం తిరిగానని చెప్తున్నాడు

పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకు ప్రధాని మోడీ అతి పెద్ద ఆస్కార్‌ అవార్డు లాంటి సర్టిఫికెట్‌ ఇచ్చారు. రాజమండ్రి సభలో పోలవరం చంద్రబాబుకు ఒక ఏటీఎం అనేది స్వయాన ప్రధానిమంత్రి చెప్పారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఒక ప్రధాన మంత్రి ఇంత పెద్ద సర్టిఫికెట్‌ ఇచ్చాడా..? నువ్వు పెద్ద అవినీతి పరుడువనే కదా ఆనాడు మోదీ చెప్పింది. 

పచ్చ మీడియా ఉంది కాబట్టే తండ్రీ కొడుకుల ఆటలు 
యువ గంగాళం.. అంటూ లోకేశ్‌ తిరుగుతున్నాడు. తండ్రికి బుద్ధిలేదు.. తెలుసుకోవడం లేదు సరే.. నాయకుడిగా ఎదుగుదాం అనుకున్న లోకేశ్‌ స్టడీ చేయాలి కదా..?. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ లోకేశ్‌ నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. 6 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చింది నిజమా.. కాదా..?. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 1.30 లక్షల ఉద్యోగాలను సచివాలయాల్లో జెట్‌ స్పీడులో నియామకాలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులను, వైద్య కళాశాలలను ఆధునికీకరించి ఉద్యోగాల కొరత లేకుండా 40 వేలమందిని నియమించింది వైయ‌స్ జగనే. 6 వేల మంది పోలీసుల నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. 1998 డిఎస్సీ వారికి వైయ‌స్ జ‌గ‌న్ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను 1.50 లక్షల మందిని నియామకం చేశారు. ఇవన్నీ మీకు తెలియదా..? మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. పచ్చ మీడియా ఉంది కాబట్టి మీ తండ్రీకొడుకుల ఆటలు సాగుతున్నాయ్‌. 

చంద్రబాబే పెద్ద సైకో..
ఎవడు సైకో..? నువ్వు ఎంత సైకో అయితే పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడుస్తావు. ఆయన ఎంత పవర్‌ సైకోనో.. ఎంతటి విశ్వాసఘాతుకానికి ఒడిగడతాడో ఆలోచించండి. మీ తమ్ముడు ఎక్కడున్నాడు అడుగుతుంటే ఎందుకు బాబు మాట్లాడటం లేదు?. సంక్రాంతికి కూడా కనిపించడేంటి అని అడిగితే మాట్లాడటం లేదు. ఈ దేశంలో ప్రజాప్రతినిధుల్లో సర్టిఫైడ్‌ సైకోలు ఒక్క మీ కుటుంబంలోనే ఉన్నారు బాబూ..

ప్రజల గుండెల్లో సీఎం వైయ‌స్‌ జగన్‌.. 
ఇంటి మీద స్టిక్కర్‌ వేస్తానంటేనే.. మీరు గజగజ వణికిపోతున్నారు. జనం గుండెల్లో వైయ‌స్ జగన్‌ ఏ రోజో స్టిక్కర్‌ గా ఉండిపోయారు. పేద ప్రజల ఇంటికి వెళ్లి తలుపు తట్టి చూడండి.. వైయ‌స్ జగన్‌ అంటే ఏంటో తెలుస్తుంది. ఒక కుటుంబానికి కనీసం లక్ష నుంచి మూడు లక్షల వరకు లబ్ధి చేకూరింది. మేం ఏం చేశామో ఇంటింటికి వెళ్లి గృహసారథుల ద్వారా చెప్తామంటే చంద్రబాబు వణికిపోతున్నాడు. ఇంటింటికి వెళ్లి ఒట్లేయించుకుంటాం అని నువ్వు చెప్తున్నావ్‌.. కానీ ఒట్టేసి ప్రజలే చెప్తున్నారు.. మేం మళ్లీ వైయ‌స్‌ జగన్‌ని గెలిపిస్తామని. వాలంటీర్‌ వ్యవస్థ మీద పడి నిరంతరం రోధన.. ఇప్పుడు గృహసారథులపై అదే రోధనా? రాష్ట్రంలో వైయ‌స్ జగన్‌ నామస్మరణ చేసే వాళ్లలో మొదటిగా తండ్రీ కొడుకులే ఉంటారు.. కలలో కూడా ఆయన పేరు తలుచుకుంటారు. 1.92 లక్షల కోట్ల డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేసిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా..? మీరు జన్మభూమి కమిటీల పేరుతో డబ్బు తగలేశారు.  చివరికి కార్యకర్తలు చనిపోకపోయినా.. చనిపోయినట్లు చూపించి వారి భార్యలకు వితంతు పింఛన్లు తీసుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది. మా నాయకుడు ఇది చేశాడు అని మేం చెప్పుకుంటాం.. అంటే మీకేంటి అంత బాధ..?

చంద్రన్న రాలేడు..
చిన్న పిల్లలు అంతా చంద్రన్న రావాలి అంటున్నారట.. చందమామ రావే అన్నట్లు ఆ చందమామా రాడు.. ఈ చంద్రన్నా అధికారంలోకి రాలేడు. ఎక్కడ తప్పులు చేశాం.. 2019 ఎన్నికల్లో జనం చావ చితకొట్టి చెవులు మూశారు అనేది ఒక్క సారైన సమీక్షించుకున్నారా..?. వైయ‌స్ జగన్‌ మీద, జనంలోకి వెళ్లి ఏడిస్తే వస్తాయా..? అసెంబ్లీలో కూర్చుని నా భార్యను అవమానించారు అంటే ఓట్లు వస్తాయా..?  జనం గుండెల్లో ఉంటే ఓట్లు వస్తాయి.. జనం అభిమానాన్ని సంపాదిస్తే ఓట్లు వస్తాయి. నలభై ఏళ్ల ఇండస్ట్రీకి డీజిల్, గ్యాస్‌ ధరలు ఎవరు పెంచుతారో కూడా తెలియకుండా ఉన్నాడు. అప్పుడే ప్రధాని అవుతానంటే లోకేశ్‌ వద్దన్నాడట.. ప్రధాని అవ్వాలనుకున్న వ్యక్తికి డీజిల్‌ ధర ఎవరు పెంచుతారో తెలియదా..?. మేం బలవంతంగా స్టిక్కర్లు వేయాల్సిన అవసరం లేదు..కులం మతం వర్గం లేకుండా పథకాలు ఇస్తున్నాం. మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా మేం పథకాలు ఇస్తున్నాం. మీరు సృష్టించిన మీడియాలో, మీరు సృష్టించిన వార్తలు చూసుకుని మీరే మోసపోతారు. ప్రజలు వాటిని చూసి మోసపోలేదు కాబట్టే 2004లో వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి, 2019లో వైయ‌స్‌ జగన్‌ అధికారంలోకి వచ్చారు.

చితక్కొట్టినా మళ్లీ వచ్చాడు..
2019లో ప్రజలు మిమ్మల్ని చావ చితకొట్టినా మళ్లీ వచ్చాడు.. ఇదేం ఖర్మరా బాబు అని నిన్ను చూసి జనం అనుకుంటున్నారు. వైయ‌స్ జగన్‌ పాదయాత్రకు, లోకేశ్‌ యాత్రకు అసలు పొంతనే లేదు. లోకేశ్‌ బాడీ లాంగ్వేజ్‌ చూస్తే నవ్వొస్తోంది.. ఆ చేతులు ఊపడానికి అర్ధం ఏమిటో చెప్పాలి. మీ ఉడుత ఊపులన్నీ చూసి బోరు కొట్టేసింది గురూ..!. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎవరు అని గూగుల్‌ని అడిగినా చంద్రబాబే అని చూపిస్తుంది. ఈ రాష్ట్రానికి ఎవర్రా ఖర్మ అని ఇంకో వందేళ్ల తర్వాత అడిగినా చంద్రబాబే అని చూపిస్తుంది. అసలు మీ బతుక్కి చెప్పుకోడానికి ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా..?.  పిల్లలను బడికి పంపి..నాణ్యమైన భోజనం పెట్టాలనే ఆలోచన మీకు రాలేదు. నేత కార్మికులకు ఏటా 24 వేల రూపాయలు అందిస్తున్నాం. ఉచిత పంటల బీమాను పెట్టారు..ఏ సీజన్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఆ సీజన్లోనే పంచుతున్నారు. ఇవన్నీ మీ చరిత్రలో ఎందుకు చేయలేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం నీ కుప్పాన్ని రెవెన్యూ డివిజన్‌ చేసుకోలేని చంద్రబాబు.. పోలవరం ముంపు గ్రామాలను జిల్లా చేస్తానంటే ప్రజలు నమ్మరు. మా నాయకుడు భవిష్యత్తు కోసం చూసే నాయకుడు.. నువ్వే మా భవిష్యత్తు అని ప్రజలంతా చూసే నాయకుడు. నీకు భవిష్యత్తు లేదు చంద్రబాబూ.. అందుకే వైయ‌స్ జగన్‌పై రోజు వారీగా తండ్రీ కొడుకులు బూతులు తిడితూ శాపనార్ధాలు పెడుతున్నారు. గతంలోలా ప్రజలు మీ ట్రాప్‌లో పడే పరిస్థితి లేదు. ఇద్దరి ఫోటోలు పక్క పక్కన పెట్టి ఎవరిది దరిద్రపు మొఖమో ప్రజల్ని అడగండి..వాళ్ళే సమాధానం చెప్తారు. మాట్లాడేటప్పుడు ఒక సంస్కారం ఉండాలి..అవన్నీ కొల్పోతే చంద్రబాబు, లోకేశ్‌లా తయారవుతారు. తిడితే లోకేశ్‌కి ఉన్న పప్పు అనే బిరుదు పోతుంది అని ఎవరో చెప్పి ఉంటారు. కానీ..పప్పులో మసాలా కలిపితే ఏమైనా విలువ ఉంటుందా..?

మమ్మల్ని క్షమించండి అని యాత్రలు చేయండి
"ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయాం.. గ్రాఫిక్స్‌తో కాలం గడిపాం.. మమ్మల్ని క్షమించండి" అని అయ్యకొడుకులు యాత్రలు చేయండి. మీరు క్షమాపణ యాత్రలు చేయాలి కానీ..ఇలాంటి పాద యాత్రల వల్ల ఉపయోగం లేదు. నేను వస్తే ఇది చేస్తాననడం ఏమిటి..? నువ్వు ఉన్నప్పుడు ఏం చేశావ్‌ అనేదే ప్రశ్న. ఎక్కువ కాలం, ఎక్కువ మందిని మోసం చేసి బతకడం కష్టం అని గుర్తించండి. వైయ‌స్ జ‌గ‌న్‌ని  శాపనార్ధాలు పెట్టే కార్యక్రమం మానేసి క్షమాపణలు చెప్పే కార్యక్రమం చేయండి. 

వైయ‌స్సార్‌ ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ వల్లే యువతకు ఐటీ ఉద్యోగాలు..
మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉద్యోగాలు ఇస్తే భార్యలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వచ్చాయని పచ్చి అబద్దాలు చెప్తున్నాడు. సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగాలు వైయ‌స్ రాజశేఖరరెడ్డి ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ పెట్టడం వల్లే ఆడపిల్లలకు కూడా వచ్చాయి. ఆ పథకాలను ఈ రోజు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మరింత విస్తృత పరిచారు. ఆరోగ్య శ్రీని కూడా అంతే విస్తృత పరిచారు.. ఇదంతా చరిత్ర. దానిని చెరిపేయలేవు. మీకు మీడియా మద్దతు ఉంది కాబట్టి వక్రీకరించగలవు..నిజం నిప్పులాంటిది. ఎప్పటికీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మాత్రం చంద్రబాబే పేరే చెప్తారు.

Back to Top