బండ బియ్యం తిన్న బడుద్దాయి నారా లోకేష్‌

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని

తాడేపల్లి: పాదయాత్రలో లోకేష్‌ ఎన్ని అడుగులు వేస్తే తెలుగుదేశం పార్టీ అంత పాతాళానికి వెళ్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. తనతో బహిరంగ చర్చకు వచ్చే అర్హత లోకేష్‌కు లేదని, ఎమ్మెల్యేగా ఓడిపోయినోడితో 4సార్లు ఎమ్మెల్యేనైన తాను చర్చించడమేంటి..? అని ప్రశ్నించారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంలో నాణ్యమైన బియ్యం ప్రతి ఇంటికీ పంపిణీ చేస్తున్నామన్నారు. బండ బియ్యం తిన్న బడుద్దాయి నారా లోకేష్‌ అని ఎద్దేవా చేశారు. తనను ఏదో చేస్తామని టీడీపీ వాళ్లు చేతకాని ప్రకటనలు ఇస్తున్నారని, టీడీపీలో ఎవడు తన వెంట్రుక కూడా పీకలేరన్నారు. లోకేష్‌ యాత్రలో ఎన్ని అడుగులేస్తే టీడీపీ అంత పాతాళానికి వెళ్తుందని, పోలీసుల బూట్లు తుడవడానికి కూడా లోకేష్‌ పనికిరాడన్నారు. 

Back to Top