తప్పుడు ప్రచారాలతో తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయొద్దు

అస్వ‌స్థ‌త‌కు గురైన విద్యార్థులకు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స

విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత

కాకినాడ: అస్వ‌స్థ‌త‌కు గురై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కేంద్రీయ విద్యాలయం విద్యార్థులను మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్ధారించారన్నారు. ఉదయం నుంచి కొంతమంది విష వాయువు అంటూ రూమర్స్‌ ప్రచారం చేస్తున్నారని, అదంతా తప్పుడు ప్రచారమని తేలిందన్నారు. 419 మంది విద్యార్థులున్న పాఠశాలలో కేవలం రెండు తరగతుల్లో 18 మంది అస్వ‌స్థ‌త‌కు గురయ్యారన్నారు. విష వాయువులు కాదు.. కారణం ఏంటనేది కమిటీ నిర్ధారిస్తుందన్నారు.  

దీన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు
పొల్యూషన్‌ కంటే తప్పుడు ప్రచారాలు ప్రమాదకరంగా అని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వంగా గీత అన్నారు. కాకినాడ జీజీహెచ్‌లో విద్యార్థులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పిల్లలకు ఏమైనా అయ్యిందంటే తల్లిదండ్రులకు ఆందోళన కలుగుతుందని, విద్యార్థులు అస్వస్థకు గురైతే.. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. పిల్లల్లో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం లేదని,  కమిటీ రిపోర్టు వచ్చిన తరువాత కారణాలు బయటకు వస్తాయన్నారు.  
 

Back to Top