అబ్బా కొడుకులిద్దర్నీ అరెస్టు చేయాలి

మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

అమరావతి పేరుతో చంద్రబాబు, లోకేష్‌ అవినీతికి పాల్పడ్డారు

రూ.118 కోట్ల ముడుపులు చంద్రబాబుకు ఎందుకు లెక్కల్లో చూపలేదు

ఐటీ నోటీసులపై చంద్రబాబుకు ఎందుకు మౌనంగా ఉన్నారు

చంద్రబాబు అవినీతితో పవన్‌కు కూడా వాటా ఉందా?

చంద్రబాబు అవినీతిపై ఎల్లోమీడియా వామపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదు?

ప్రభుత్వం అప్పులపై మాట్లాడే పురంధేశ్వరి ఎందుకు మౌనంగా ఉన్నారు?

చంద్రబాబు ఒళ్లంతా అవినీతి మచ్చలే

రాష్ట్ర ప్రజలు వీరి వైఖరిని గమనిస్తున్నారు

తన అవినీతికి చంద్రబాబు శిక్ష అనుభవిస్తారు

తాడేపల్లి: అమ‌రావ‌తి పేరుతో అవినీతికి పాల్ప‌డిన చంద్రబాబు, ఆయ‌న కుమారుడు లోకేష్‌పై కేంద్ర ప్ర‌భుత్వం విచార‌ణ చేప‌ట్టి అబ్బా కొడుకులిద్ద‌ర్ని అరెస్టు చేయాల‌ని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాద‌వ్ డిమాండు చేశారు. ఐటీ శాఖ జారీ చేసిన నోటీ­సులకు  చంద్రబాబు తక్షణమే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.  అమ‌రావ‌తి భూదందాలో చంద్ర‌బాబు కమీషన్లుగా దండుకుంటే ఆయ‌న ద‌త్త‌పుత్రుడు, బీజేపీ అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి, వామ‌ప‌క్షాలు, ఎల్లోమీడియా ఎందుకు నోరుమెద‌ప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. తాడే­పల్లి­లోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగ‌ళ‌వారం అనిల్‌కుమార్‌యాద‌వ్  మీడి­యాతో మాట్లా­డారు. 

అనిల్‌కుమార్‌యాద‌వ్ ఇంకా ఏమ‌న్నారంటే..

బాబు 5ఏళ్ళ పాలనలో అక్రమాలపై దర్యాప్తు జరగాలి:
- చంద్రబాబుకు ఒక పక్క వయస్సు, మరోపక్క శక్తి అయిపోయాయి.. మొత్తంగా ఆయన పని అయిపోయింది. చంద్రబాబు చేసిన పాపాలకు, దుర్మార్గాలకు, పొడిచిన వెన్నుపోట్లకు పాప పరిహారం చెల్లించాల్సిన సమయం మాత్రమే  మిగిలిఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్ కామ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్(ఐటీ) చంద్రబాబుకు షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, అమరావతిలో కాంట్రాక్టు పనులకు సంబంధించి రెండు సంస్థలకు ఒకే ఒక్క సంవత్సరం, ఒకే అసెస్ మెంట్ ఇయర్ కు సంబంధించి రూ.118కోట్ల ముడుపులు చంద్రబాబుకు అందాయి. దీనికి సంబంధించి వివరణ ఇవ్వమని హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం జరిగింది.  షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధిగా పనిచేస్తున్న మనోజ్ వాసుదేవ్ ను విచారించగా, విచారణలో తీగలాగితే..  డొంక కదిలినట్లుగా, లావాదేవీల్లో భాగంగా ఆయన ఈమెయిల్స్,  చాట్స్, ఎస్ఎంఎస్ లలో చంద్రబాబుకు ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చాం, ఎంతెంత డబ్బులు ఇచ్చాం, ఎవరిద్వారా డబ్బులు ఇచ్చాం, ఎలా డబ్బులు ఇచ్చాం.. అని దాదాపు రూ.118కోట్ల ముడుపుల వ్యవహారం తేలితే దానికి సంబంధించి ఇన్ కామ్ ట్యాక్స్  వారు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి, వివరణ అడగడం జరిగింది. ఏ విధంగా చంద్రబాబుకు ఈ కంపెనీల ద్వారా డబ్బులు ముట్టాయి. ఈ ముడుపుల్ని విక్కీ జైన్ ద్వారా ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఏ కోడ్ లాంగ్వేజ్ లో చేర్చాలో చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ అవినీతి కేవలం అమరావతిలో రెండు సంస్థలకు, రెండు వర్క్ ల్లో జరిగినది మాత్రమే. చంద్రబాబు 5ఏళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన లావాదేవీలు, కాంట్రాక్టులు,  అమరావతి రాజధాని పేరుమీద జరిగిన భూదందాలు కానీ, మొత్తం వ్యవహారంపై ఐటీ వారు దర్యాప్తు చేస్తే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల దోపడీ ధనం బయటకు వచ్చే పరిస్థితి.  2020లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పై ఇన్ కామ్ ట్యాక్స్ దాడులు జరిగాయి, ఐన్ కామ్ ట్యాక్స్ రైడ్స్ లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ దగ్గర మొత్తం రూ.2000కోట్ల ఆస్తులు సమకూర్చుకున్నారని ఐటీ వారే ధృవీకరించడం జరిగింది. 

  • బాబు, లోకేష్ లను అరెస్టు చేసి విచారించాలిః
    - చంద్రబాబు ఐదేళ్ల పాలన డొంక కదిలితే కొన్ని వేల కోట్ల అవినీతి సొమ్ము బయటకువస్తుంది. తండ్రీకొడుకుల మీద కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తప్పకుండా చంద్రబాబు, లోకేష్ లను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వారి ఈ-మెయిల్స్, చాట్స్, ఎస్ఎమ్ఎస్ లలో ముడుపుల వ్యవహారం వివరాలతో సహా ఉన్నాయి. ఐటీ నోటీసులు ఈ సర్కిల్ పరిధి కాదు, జూబ్లిహీల్స్ సర్కిల్ అని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. అంటేనే ముడుపులు తీసుకుంది వాస్తవామే కానీ, నోటీసు అక్కడి నుంచి రావాలనే పరిస్థితి చంద్రబాబుది.. 
    - తల దొరికేసింది.. లిస్ట్ మారితే, డొంక కదిలితే తర్వాత రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, దత్తపుత్రుడు కూడా ఐటీ శాఖ ముందు క్యూలు కట్టే పరిస్థితి. దాంతో వాళ్ళు కూడా  ఫ్యాంటులు తడుపుకుంటున్నారా? లేక ఎక్కడైనా దాక్కున్నారా?
    - చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకోకపోతే, బీజేపీతోనే పొత్తులో కొనసాగుతూ ఉంటే, ముడుపులతో తనకు ఎటువంటి సంబంధం లేదని దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఈ పాటికే చెప్పేవాడు. 
    - చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన దొంగ, ఈ దొంగతోపాటు ఆయనకు మద్దతు ఇచ్చిన మరికొందరు దొంగలు కూడా దాక్కున్నారు. జ్యోతి దొంగ, ఈనాడు దొంగ,  టీవీ5 దొంగలు, దత్త దొంగలు.. వీళ్ళందరి జాతకాలు బయటకు వస్తాయి. 

    నోరు తెరిస్తే.. డొక్క పగులుద్దనే మూసుకున్నారా.?
    - పొద్దున లేచిన దగ్గర నుంచీ.. నేను సత్యహరిశ్చంద్రుడినని, నా అంత నీతివంతుడు ఎవరూ లేడు అని, ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో నేనే నిజాయతీపరుడునని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఈ నోటీసులపై నోరు విప్పడం లేదు. ఇక్కడ, రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందే ఏంటంటే.. ఇది వైయస్ఆర్సీపీ  రాజకీయ కక్షతో జరిగింది కాదు, వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసు అంతకన్నా కాదు. ఇది సాక్షాత్తూ.. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన ఢిల్లీలోని ఇన్ కామ్ ట్యాక్స్ వారు నోటీసు జారీ చేయడం జరిగింది. దీనికి సమాధానం చెప్పకుండా.. కప్పను మింగిన పాములా నోరు మెదపకుండా, అన్నీ మూసుకుని నాకు సంబంధం లేదన్నట్టుగా, హైదరాబాద్ కు మకాం మార్చి, దొంగలా దాక్కున్న దొంగ చంద్రబాబు.  అలానే,  సీఎం జగన్ గారు, ప్రధాని మోడీ గారు అధికారికంగా సమావేశమై, వన్ టూ వన్ మాట్లాడుకున్నదీ బాత్ రూమ్ లో నక్కి విన్నట్లుగా తప్పుడు వార్తలు రాసే ఏబీఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీ, టీవీ5 బీఆర్ నాయుడులకు బాబుకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు కనిపించడం లేదా? మీకు తెలియదా? తెలిసినా.. మీకూ వాటాలందాయని, ఈ డొంక కదిలితే, చంద్రబాబుతోపాటు మీ డొక్క కూడా పగులుతుందని, చంద్రబాబు మీకు పంచిన వాటాలు బయటపడతాయనే భయంతో, ఫ్యాంటులు తడుపుకుని మీరంతా కట్టకట్టుకుని నోరు మూసుకున్నారా?

    దత్తపుత్రుడికీ ముడుపులు..!
    - గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి మీద, వైయస్ఆర్సీపీ మీద అవాకులు, చవాకులు పేలుతూ, మాట్లాడితే ట్వీట్ లు పెట్టే దత్తపుత్రుడు- చంద్రబాబుకు ఐటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుల వ్యవహారం మీద ఎందుకు మాట్లాడట్లేదు. ప్రతి విషయంలో,  చంద్రబాబు దత్తపుత్రుడిలా ఆయన తరఫున పేటెంట్ తీసుకుని మాట్లాడే పవన్ కల్యాన్ ను ప్రశ్నిస్తున్నాను. రూ.118కోట్ల ముడుపులకు సంబంధించిన ఇంత పెద్ద వ్యవహారంలో, నువ్వు మద్దతు తెలుపుతున్న బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏజెన్సీ నోటీసు ఇస్తే, కనీసం ట్వీట్ కూడా పెట్టట్లేదంటే నీకు కూడా ఆ లావాదేవీల్లో ముడుపుల్లో అందాయి. పవన్ కల్యాణ్ కు కూడా ఎంతోకొంత ముట్టి ఉంటేనే- ఈరోజు మెదలకుండా, కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబును రక్షించే ప్రయత్నం చేస్తున్నాడనేది అర్థమవుతుంది కదా?
    - అలానే, వామపక్షాలు కూడా ఎందుకు నోరు మెదపట్లేదు. ప్రతీదానికి నోరేసుకుని పడిపోయే సీపీఐ నారాయణ, రామకృష్ణ ఏమైపోయారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై కచ్చితంగా స్పందించాలి.

    బంధు ప్రీతా.? మరిది ప్రీతా.?
    - బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షురాలైనా పురంధేశ్వరి ఈమధ్య కాలంలో రోజూ ప్రెస్ మీట్ లు పెట్టి అంత అప్పులు, ఇంత అప్పులు అని  ముఖమంత్రి జగన్ గారి గురించి మాట్లాడే మీరు ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు.? మీ మరిదిని కాపాడుకునే ప్రయత్నమా? కేంద్రంలోని మీ ప్రభుత్వ సంస్థ నోటీసులు అందిస్తే.. ఈరోజుకూ నోరు మెదపలేదంటే ఏంటి? బంధు ప్రీతా? మరిది ప్రీతా? దీనిపై కచ్ఛితంగా సమాధానం చెప్పాలి. మీకు బంధు ప్రీతే కావాలా? లేక ప్రజల పక్షాన నిలబడతారా అనేది తేల్చుకోవాలి? మరిదిని కాపాడుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన పురందేశ్వరి కచ్చితంగా ఐటీ నోటీసులపై మాట్లాడాలి.  వీళ్లందరూ చంద్రబాబు ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించట్లేదో రాష్ట్రప్రజలు గమనిస్తున్నారు.

    లోకేష్ పాత్రపైనా విచారణ జరగాలి
    - బాబు సుపుత్రడు పులకేశి లోకేష్ ప్రతి ఊరు తిరుగుతూ.. మా నాన్న నిప్పు, నేను తుప్పు.. అని మాట్లాడుతున్నాడు. మేము నిజాయతీపరులాం, మామీద ఒక్క ఆరోపణ కూడా లేదు, మేము కడిగిన ముత్యం అని మాట్లాడుతున్న నిప్పు, తుప్పులను అడుగుతున్నా. ఐటీ జారీ చేసిన ఆ 46 పేజీల షోకాజ్ నోటీసుల్లో పులకేశి లోకేష్ పేరు కూడా ఉంది. తండ్రికొడుకులకు రూ.118కోట్లు ముడుపులు అందాయని స్పష్టంగా ఉంది. దుబాయ్ లో కూడా రూ.16 కోట్లు వీళ్లకు అందాయి. 

    అమరావతి ఒక బూటకం- దాని వెనుక అన్నీ దోపిడీలే
    -అమరావతి రైతులకు మా విన్నపం ఏంటంటే... అమరావతి అనేది కేవలం బూటకం.. ఒక బొమ్మ మాత్రమే దాని వెనుక జరిగిందంతా లంచాలు, భూదందా, కమీషన్ల దందా మాత్రమే..
    బాబు ఢిల్లీ పరుగులు, గుసగుసలు దేనికో..?
    - జగన్ గారు ఢిల్లీకి వెళ్తే కేసులు కోసమని  చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు పదే పదే మాట్లాడతారు. ఇప్పుడు ఆ వంక, ఈ వంకతో చంద్రబాబు ఎందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్నారు, నడ్డా పక్కన కూర్చొని ఏంటీ ఆ గుసగుసలు.. ఎందుకంటే మీ బతుకులు బయటపడ్డాయి, మీ బండారం బయటపడింది, అమరావతి పనుల్లో మీరు తీసుకున్న ముడుపుల చిట్టా తీగ లాగితే ఈరోజు రూ.118కోట్లని తేలింది, ఇంకా డొంక కదిలితే మీ పరిస్థితి ఏంటనేది చంద్రబాబు అండ్ కో.. ఆందోళన. 

    చంద్రబాబు పాపాలు పండాయిః
    ఎన్నో గొడ్లను తిన్న రాబందు.. ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్లు.. ఎన్నో సంవత్సరాలుగా దోపిడీలు, పాపాలు, మోసాలు చేసిన చంద్రబాబు పాపం పండింది. అధికారాన్ని అడ్డం  పెట్టుకుని ఆయన చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముసుగు వేసుకుని తాను నిజాయితీపరుడిని, సత్యహరిశ్చండ్రునని, తనమీద ఏ మచ్చ లేదనే చంద్రబాబూ.. నీ ఒళ్ళంతా అవినీతి మచ్చలే, ఆ మచ్చల్ని ఎంత కడిగినా పోవు. 
    - ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? చంద్రబాబు ఏ పని చేసిన దాని వెనకాల నాకేంటి.. నాకేంటి అనేది తప్ప ఇంకేమీ లేదనే సంగతి అర్థమైంది. కచ్చితంగా చంద్రబాబుపై కేసు పెట్టాలి. బాబు, చినబాబు, దత్తపుత్రుడు...  ముగ్గురికి కూడా ప్రజలు బుద్ది చెప్పే సమయం వచ్చింది. 
    - ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ గారిని  తిరిగి సీఎం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ, జనసేన కలిసివచ్చినా, విడివిడిగా వచ్చినా, వారిని రాజకీయంగా బొందపెట్టి, 2024 తర్వాత సమాధి చేసి రెండు పార్టీలను కప్పిపెట్టేందకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.

Back to Top