బూటకపు హామీల‌తో చంద్ర‌బాబు మోసం

మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ డాక్ట‌ర్స్ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు సీదిరి అప్ప‌ల‌రాజు

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ లో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం 

శ్రీ‌కాకుళం:  అధికారంలోకి వ‌చ్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు బూట‌క‌పు హామీలు ఇచ్చి మోసం చేశార‌ని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ డాక్ట‌ర్స్ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు సీదిరి అప్ప‌ల‌రాజు మండిప‌డ్డారు. `బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ` కార్యక్రమంలో భాగంగా సోమ‌వారం పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షులు శిష్టు గోపి అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన స‌మావేశంలో రీకాలింగ్ చంద్ర‌బాబు మేనిఫెస్టో కార్య‌క్ర‌మంపై సీదిరి అప్ప‌ల‌రాజు దిశానిర్దేశం చేశారు.   ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు బూటకపు హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో పాటు వందలాది హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలన తీరును పట్టణం లో ఉన్న ప్రజలు వద్దకు వెళ్లి వాళ్లకు జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలు కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా కనుమరుగయ్యాయని, ప్రభుత్వం అవినీతి లో కురికిపోయిందని, రాష్ట్రాన్ని కూటమి నేతలు దోచుకు తింటున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం లో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ హామీలు అమలు చేయకుండా వీరి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు...ఈ సందర్బంగా అప్పలరాజు గారు కార్యకర్తలును ఉద్దేశించి రాబోయే రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చి వైయ‌స్ జ‌గ‌న్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత కార్యకర్తల‌కు పెద్దపీఠం వేస్తామ‌ని భ‌రోసా క‌ల్పించారు.  కార్యక్రమంలో పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ కౌన్సిలర్స్, జిల్లా అనుబంధ విభాగ నాయకులు, అనుబంధ విభాగం అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

Back to Top