తాడేపల్లి: చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ అయిన మంద కృష్ణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆదిమూలపు సురేష్, కొమ్మూరి కనకారావు మండిపడ్డారు. తన జీవితం అంతా చంద్రబాబుకు రాజకీయంగా ఎలా ఉపయోగపడాలా? అన్నలోచనలే తప్ప మాదిగల సంక్షేమం ఏరోజూ పట్టలేదన్నారు. గడచిన మూడు దశాబ్దాలుగా మాదిగల పేరుతో రాజకీయాలు చేసి, నాలుగు ఓట్లు సంపాదించుకునే రాజకీయాలు మాత్రమే చంద్రబాబు చేశారు. అలా చంద్రబాబు చేసే రాజకీయాల్లో మందకృష్ణ మాదిగ ఒక పనిముట్టుగా మాత్రమే పనిచేస్తున్నాదని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ నేతలు ఆదిమూలపు సురేష్, కొమ్మూరి కనకారావు మీడియాతో మాట్లాడారు. 1997లో ఎస్సీ కేటగిరైజేషన్ చేసినప్పుడు దానికి చట్టబద్ధత తీసుకు వచ్చే అవకాశం ఆరోజు చంద్రబాబు చేతిలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు చంద్రబాబు చక్రం తిప్పుతున్నానని డప్పాకొట్టుకున్న రోజుల్లో మరి చంద్రబాబు ఆరోజు ఎందుకు చేయలేదు. ఆతర్వాత కూడా చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామి. ఆతర్వాతకూడా ఎందుకు చేయలేదు? చేస్తానంటే ఎవరు అడ్డుకున్నారు ? కేవలం రాజకీయాల కోసం మాత్రమే మాదిగలను వాడుకోవడం చంద్రబాబుకు ఒక అలవాటుగా మారింది. ఇప్పుడు కూడా రిజర్వేషన్లపై ఒక స్పష్టత లేకుండా, స్టేట్ కేడర్‌కు వర్తింపు చేసే ఆలోచన లేకుండా, మళ్లీ పక్షపాతం చూపుతూ ఏదో దిగువస్థాయి ఉద్యోగాలకు పరిమితంచేసే ఆలోచన చంద్రబాబు చేస్తున్నారే కాని, మాదిగలకు మేలు చేయాలని కాదు. ఈ అంశం పరిష్కారం కాకూడదు, ఎప్పటికీ బతికే ఉండాలి, మా ఎస్సీలంతా ఎప్పుడూ కొట్టుకు చావాలి.. ఆ మంటల్లో రాజకీయంగా తన ప్రయోజనాలను ఏరుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు ఉంది. దానికోసమే ఈ మందకృష్ణమాదిగ ఈ రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు పనిముట్టుగా పనిచేస్తున్నాడు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు, రాష్ట్రకేడర్.. ఇలా అన్నిరకాలుగా వర్తింపు చేసేలా పార్లమెంటులో చట్టం తీసుకురావాలి. ఎన్నో పెద్ద ఎద్ద విషయాల్లో రాజ్యాంగాన్ని పలుమార్లు సవరించిన అంశం ఎన్డీయే పరిపాలనలో జరిగింది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబు బలంమీద ఆధారపడి ఉంది. చంద్రబాబు ఎంపీలు మద్దతుగా ఉంటేనే కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని వినియోగించుకుని పార్లమెంటులో చట్టంకోసం ఎందుకు చంద్రబాబు ప్రయత్నించడం లేదు. మరి చిత్తశుద్ధిలేని చంద్రబాబు మాటలను మా మాదిగలు ఎలానమ్ముతారు. చంద్రబాబు ఏం చేస్తున్నాడని నమ్ముతారు ఈ విడతతో కలిపి చంద్రబాబు మొత్తం నాలుగు సార్లు సీఎం అయ్యాడు. గడచిన 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలంలో.. తన చేతిలో ఉన్న అధికారాలతో చంద్రబాబు మాదిగలకు ఏంచేశాడు? కనీసం మాదిగలకు కార్పొరేషన్ అయినా పెట్టాడా? మంచి చదువులు అయినా చెప్పించాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? దామాషా పద్ధతిలో తన చేతిలో ఉన్నవాటితో ఏమైనా చేశాడా? వైయస్.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన చేతిలో అధికారాలతో చేయాల్సిన మంచి అంతా చేశారు. కేబినెట్‌లో, మంత్రిపదవుల్లో ఎన్నడూలేని ప్రాధాన్యత కల్పించారు. ఐదేళ్లలో రెండున్నరేళ్లు మాల సోదరికి, రెండున్నరేళ్లు మాదిగ సోదరికి హోంమంత్రిగా అవకాశాలు కల్పించారు. అంతేకాదు మాదిగ సోదరి వనిత, సురేష్‌లకు ఐదేళ్లపాటు మంత్రిపదవులు ఇచ్చారు. మంత్రివర్గంలో ఐదుగురు మాల మాదిగలకు స్థానం కల్పించారు. అందులో రెండు స్థానాలు మాదిగలకే ఇచ్చారు. తనచేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించుకుని దామాషా పద్ధతిలో జనాభా ప్రతిపదికిన అన్నిరకాలుగా ఆదుకున్న వ్యక్తి వైయస్.జగన్ గారే. ప్రధానమైన 22 డీబీటీ పథకాలు సహా మరెన్నో పథకాలు, కార్యక్రమాలు ద్వారా మాదిగ కుటుంబాల్లో ఎంతోమంది తలరాతలు మారాయి. పీజు రియంబర్స్ ద్వారా ఎంతోమంది చదువుకున్నారు. అలాంటి వైయస్ జగన్‌గారిని నోటికి వచ్చినట్టు మందకృష్ణ మాట్లాడితే సహించేది లేదు. చంద్రబాబు చేతిలో పనిముట్టుగా మారి రాష్ట్రంలో లేని అలజడి సృష్టించాలని చూస్తే కుదరదు. ముందు డ్రామాలు కట్టిపెట్టి.. మీకు చేతనైతే పార్లమెంటులో చట్టం చేయండి.