మచిలీపట్నం: టీడీపీ కూటమి మేనిఫెస్టో అంతా పాపాల పుట్ట..అసత్యాల బొంత అని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. చంద్రబాబు మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పేసింది. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే ధైర్యం కూడా లేదు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తాలేదు. రాష్ట్రాన్ని ఉద్దరించడానికి కాదు.. అధికారం కోసమే ముగ్గురూ కలిశారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేనిఫెస్టోలో ఏం పెట్టారు? అని పేర్ని నాని ప్రశ్నించారు. కూటమి మేనిఫెస్టోపై పేర్నినాని స్పందించారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాతో ఏం మాట్లాడారంటే: *బాబూ...నీలో నిజాయితీ ఉంటే 2014 మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశావో చెప్పు:* – జగన్ గారు మేనిఫెస్టో విడుదల చేసిన తీరు చూడండి. 2019లో నా మేనిఫెస్టో ఇదిగో..దీనిలో 99 శాతం నేను అమలు చేశానని ధైర్యంగా చెప్పారు. – రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ..ఎన్ని ఇబ్బందులున్నా ఏటా రూ.71 వేల కోట్లు నేను పేదల కోసం ఖర్చు పెట్టానని చెప్పారు. – రెండు గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసం చెప్పిన చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ అదేమీ చెప్పలేకపోయాడు. – చంద్రబాబునాయుడు నిజంగా నిజాయితీపరుడైతే 2014లో మూడు పార్టీలు కలిసి సంతకం పెట్టి ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమేమి అమలు చేశాడో చెప్పాల్సింది. – ఇళ్లు లేని ప్రతి పేదవానికీ 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాం..ఎవరికన్నా ఇచ్చాడా? ఎన్ని లక్షల మందికి ఇచ్చాడు? – ఇంట్లో ఆడపిల్ల పుడితే ప్రతి ఆడపిల్లకు రూ.25వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తాను అన్నాడు. ఎంత మందికి చేశారు? – డ్వాక్రా అక్కచెల్లెమ్మలు తీసుకున్న రూ.14వేల కోట్లు బేషరతుగా రుణమాఫీ చేస్తాం అన్నారు. చేశారా? – రైతులకు రూ.85 వేల కోట్ల అప్పులను తీర్చి బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని కూడా తెప్పిస్తానన్నారు. ఎంత మందికి చేశారు? – పాత మేనిఫెస్టో చూపించి ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడారా? – అదే ముగ్గురం మేం మళ్లీ వస్తున్నాం...ఇన్ని హామీలిచ్చాం..ఇన్ని నెరవేర్చాం..మళ్లీ హామీలు ఇస్తున్నాం..అని చెప్పే సత్తా లేకపోయింది. – ఇదే మోసగాళ్లు ఈ రోజు మాట్లాడిన మాటలు కూడా మనం చూశాం. – ఇప్పుడొచ్చి నేను పంచాయతీరాజ్ వ్యవస్థను ఉద్దరిస్తానంటున్నాడు. 2014–19 మధ్యలో ఆ వ్యవస్థను సర్వనాశనం చేసింది ఎవరు? – పంచాయతీల్లో సర్పంచ్‌లు, పాలకవర్గం ఉండగా..అధికారమంతా జన్మభూమి కమిటీలకు ఇచ్చి ఏ పథకం కావాలన్నా వారు టిక్ పెడితేనే కాని ఇవ్వకుండా ఆ పంచాయతీలను సర్వనాశనం చేసింది ఎవరు? *మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురూ కలిశారు?:* – నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే బీజేపీతో కలిశాను అని చంద్రబాబు చాలా గర్వంగా చెప్పాడు. – ఈ రోజు ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి నువ్వేం ఇచ్చావ్..? – ప్రత్యేక హోదా ఇచ్చావా? రైల్వే జోన్ ఇచ్చావా? విభజన హామీల గురించి ఏమైనా రాశావా? – కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా రాశావా? విశాఖ స్టీల్స్‌ను అమ్మేయకుండా నిలబెడతాం అని ఏమైనా రాశారా? – మరి మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురూ కలిశారు? – కేవలం అధికారం కోసమే మీరు ముగ్గురు జట్టు కట్టారు. – ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలు జరిగేది మీ మేనిఫెస్టోలో ఏముంది? – 2019లో మీరంతా తిట్టుకున్నారు కదా.? నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటూ ఒకరినొకరు తిట్టుకున్నారు కదా! – మీకు మీరే ఒకర్ని ఒకరు దొంగలు అన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు దొంగలు ఎందుకు కలిశారు? – అదేమంటే జనం కోసమే మేం ముగ్గురం కలిశాం అంటారు. మీరిచ్చిన మేనిఫెస్టోలో జనం కోసం ఏముంది? – జగన్ గారు అమ్మ ఒడి రూ.15వేలు ఇస్తున్నాడు కాబట్టి నేను రూ.20వేలిస్తానంటాడు. – జగన్‌గారు మహిళలకు చేయూత ఇస్తున్నాడు కాబట్టి నేను కూడా పెంచి ఇస్తానంటాడు. – జగన్ గారు మత్స్యకారులకు రూ.10 వేలు ఇస్తున్నాడు కాబట్టి నేను రూ.15వేలు ఇస్తానంటాడు. – ఇదే హామీలను 2014లో కూడా ఇచ్చారు కదా? అవేమయ్యాయి? – ఈ మేనిఫెస్టోలో 90 శాతం జగన్ గారి మేనిఫెస్టోను కాపీ కొట్టారు. 10 శాతం కర్నాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టారు. – జగన్ గారు ఆదాయం గురించి చెప్పిన విధంగా మీకు చెప్పే దమ్ముందా? – మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత..నేను ఖర్చు పెట్టింది ఎంత అని స్పష్టంగా జగన్ గారు చెప్పారు. – ఇన్ని కష్టాలు పడి జగన్ గారే రూ.71 వేల కోట్లు ఏటా ఖర్చు చేశారు. – మీ మేనిఫెస్టో ప్రకారం ఏటా రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాలి. – 2014లో మూడు సెంట్లు స్థలం ఇస్తానని ఇవ్వకుండా..ఇప్పుడు రెండు సెంట్లు అంటున్నాడు. – జగన్ గారు 31 లక్షల మందికి స్థలాలు ఇస్తే ఎక్కడ జగన్‌ను గుర్తుపెట్టుకుంటారో అని రెండు సెంట్లు ఇస్తానంటున్నారు. – పాత మూడు సెంట్లు సంగతి ఏంటి? అది కూడా కలిపి ఐదు సెంట్లు ఇస్తావా? – పాత మూడు సెంట్లు బాకీ ఉన్నావు కదా? డ్వ్రాక్రా అక్క చెల్లెమ్మలకు రూ.14వేల కోట్లు బాకీ ఉన్నావు కదా? – నీ మూలంగా పచ్చగా ఉన్న డ్వాక్రా సంఘాలు నాశనం అయ్యాయి కదా? *సంపద సృష్టించడానికి ఈ రాష్ట్రమేమన్నా అక్షయపాత్రా?:* – సరే హామీలిచ్చారు. ఈ హామీలకు ఎంత ఖర్చు అవుతుందని ఖర్చుల వివరాలు కూడా చెప్పాలి కదా? – రాష్ట్ర ఖజానాలో డబ్బు ఎంత ఉంది? నువ్విచ్చిన హామీలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావ్? దొంగనోట్లు ముద్రిస్తావా? – అప్పు తీసుకురాను అంటున్నాడు. మరి అప్పు తేకుండా రాబడి ఎంత? – ఈ రోజుకీ ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్ ఉద్యోగుల పెన్షన్ కలిపి ఏటా రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతోంది. – రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న అప్పుల ఇన్‌స్టాల్‌మెంట్లు, వడ్డీలు అన్నీ కలిపి ఏటా రూ.55 వేలు కట్టాలి. – నీకు నిజాయితీ ఉంటే ఎంత ఆదాయం వస్తుంది..ఎలా ఖర్చు చేస్తావు అనేది చెప్పాల్సింది. – అదేమంటే నేను సంపద సృష్టిస్తాను అంటాడు. ఆ సంపదలో నుంచి పథకాలు అమలు చేస్తాడట. – సంపద సృష్టించాలంటే అదేమన్నా అక్షయపాత్రా? లంకెబిందెలా? రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? – ఈ పథకాలన్నీ అమలు చేయడానికి నువ్వు డబ్బెక్కడి నుంచి తెస్తావో ప్రజలకు చెప్పాలి కదా? – 2014లో ఎలాగైతే పచ్చి దగా, మోసం చేశావో..మళ్లీ ఈ మేనిఫెస్టోను అదే దగాతో విడుదల చేశావు. *ఎన్డీయేకి 400 సీట్లు దేనికీ..? ఎవరి పౌరసత్వాలు తీసేయబోతున్నారు?:* – ఎన్డీయేకి 400 సీట్లు కావాలట. దేనికోసం? ఎంత మందిని కాల్చుకు తినడానికి? – మైనార్టీలను ఈ దేశంలో లేకుండా తరిమేస్తారా? అత్యధిక మెజార్టీ దేనికి మీకు? – అత్యధిక మెజార్టీ ఇవ్వడం వల్ల మీరు ఏమేం చేయబోతున్నారు? – ఎవరివైనా పౌరసత్వాలు, ఓట్లు తీసేయబోతున్నారా? ఏం దుడుకు చర్యలు చేయడానికి 400 సీట్లు అడుగుతున్నారు? – మీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? – నిజాయితీగా మాట్లాడటం అనేది చంద్రబాబు జన్మలో ఒక్కసారి కూడా జరగలేదు. – ఎంత సేపు మోసం, దగా. అవసరం ఉన్నప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించడం..అవసరం తీరాక తగలబెట్టేయడం. – మనిషి అన్నాక వంద మాటలు చెప్తే కనీసం 90 మాటలన్నా అమలు చేయాలి కదా? – మనిషి అన్నాక కనీసం విశ్వసనీయత ఉండాలి కదా? – చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ లాంటి వల్లే కదా..దేశంలో, రాష్ట్రంలో రాజకీయ నాయకుల విలువ పోతున్నది? – అవసరం ఉంటే ఓట్ల కోసం ఎన్ని పచ్చి మోసపు మాటలైనా చెప్తారు అనే భావన ప్రజల్లో ఉన్నది మీలాంటి వాళ్ల వల్లనే. *జగన్ గారి పథకాలు అమలు చేయడానికి నువ్వెందుకు బాబూ?:* – మీ మేనిఫెస్టో అన్నీ జగన్ గారి పథకాలే కదా? జగన్ గారి పథకాలు అమలు చేయడానికి మీరు కావాలా? జగనే ఉన్నాడుగా..! – మొన్నటి వరకూ వాలంటీర్లు అమ్మాయిలను అమ్మేస్తున్నారు..మిట్ట మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనప్పుడు తలుపులు కొడుతున్నారు అన్నారు. – వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాం అన్న వాళ్లు ఇప్పుడు వాళ్లను కొనసాగిస్తాం..పదివేలు గౌరవ వేతనం ఇస్తాం అంటున్నారు. – మీకు అధికారం ఇస్తే వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారో జనానికి తెలియదా? – ఈ రోజు చంద్రబాబుకు కొత్తగా ముస్లింలు, మైనార్టీలపై ప్రేమ వచ్చేసింది. – నీ ఐదేళ్ల పరిపాలనలో ఒక్కరంటే ఒక్క ముస్లిం మంత్రి లేడు. – అధికారంలో ఉంటే రాజ్యాధికారంలో మైనార్టీలకు వాటా ఇవ్వవు. – ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు సంక్షేమం చేసేస్తానంటూ చెప్పుకొస్తున్నాడు. – 2014 మేనిఫెస్టోలో రజకులు, మత్స్యకారులను ఎస్సీలుగా, బోయలను ఎస్టీలుగా, కాపులను బీసీలుగా చేస్తానన్నాడు. ఎవరినన్నా చేశాడా? – ఎస్సీ వర్గీకరణ చేస్తానంటూ మాల, మాదిగలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. – 1999 నుంచి ఢిల్లీలో చక్రం తిప్పాను అంటావు..ఎస్సీల వర్గీకరణ చేశావా? – మళ్లీ ఇప్పుడు ఎన్నికలు రాగానే ఎస్సీల వర్గీకరణ చేస్తానంటున్నాడు. – మొన్నటి వరకూ రజకులకు ఇస్త్రీ పెట్టె ఇస్తానన్నాడు..ఇప్పుడు కరెంట్ ఇస్త్రీ పెట్టె ఇస్తాడట. – మొన్నటి వరకూ వడ్డెరలకు డ్రిల్లింగ్ మిషన్ ఇస్తానన్నాడు. ఇప్పుడు కరెంట్ డ్రిల్లింగ్ మిషన్ ఇస్తాడట. – చేనేతలకు మరమగ్గాలు ఇస్తాడట. మరి యాదవులకు కూడా కరెంట్ గొర్రెలను ఇస్తావా? – ఎంత సేపూ వెనుకబడిన వర్గాలు చదువులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా కులవృత్తులు చేసుకుంటూనే ఉండాలా? – అసలు ఈ వెనుకబడిన వర్గాలకు చదువు ఎందుకు చెప్పించవు? – ఇంగ్లీషులో చదువు చెప్పించి మీ జీవితాలు బాగుచేస్తానని చెప్పాలి కదా? – నాయీ బ్రాహ్మణులకు అంతకు ముందు కత్తెర్లు ఇస్తానన్నాడు. ఇప్పుడు ట్రిమ్మర్లు ఇస్తాడట. – వాళ్లకు నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించి దమ్ముగా పెద్దింటి పిల్లలతో పోటీ పడేటట్లు చేయాలి కదా? – ఎందుకు ఒక్క రోజన్నా జగన్ గారిలా ఆలోచించలేకపోతున్నావ్..? *నీలో నిజాయితీ ఉంటే నీ దగా మేనిఫెస్టోకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పు:* – బుర్రకథ బ్యాచ్‌లా చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ తయారయ్యాయి. – ఒకరు తానా అంటే మరొకరు తందానా అంటారు. – చంద్రబాబును నేను చాలెంజ్ చేస్తున్నా. నిజంగా నువ్వు నిజాయితీ గల రాజకీయ నాయకుడివైతే నా సవాల్‌ను స్వీకరించు. – ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత? నువ్వు చెప్పిన ఈ దగా మేనిఫెస్టోకు ఖర్చు ఎంతవుతుందో చెప్పాలి. – ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో చెప్పే నిజాయితీ నీలో ఉందా? – అందుకే నువ్వు పింఛన్ 4వేలు ఇస్తానన్నా..జగన్ 3,500 ఇస్తానంటే జనం జగన్‌వైపే ఉన్నారు. – 4వేలు చెప్పినా ఇచ్చేది లేదని వాళ్లకి స్పష్టంగా తెలుసు. – జగనంటే ఐదు పదుల నడుస్తున్న నమ్మకం. – ఈ బుర్రకథ బ్యాచ్ అంటే ఏడున్నర పదుల తిరుగాడే అపనమ్మకం. – మనకు వయసు ఎంత వచ్చిందనేది కాదు..ఒక్క రోజన్నా నిజాయితీగా బతికామా అన్నదే చూడాలి.. – దమ్ముగా జగన్ గారిలా దీనికి ఎంత ఖర్చు అవుతుందో నిజాయితీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. – పేదల్లో పేదరికం పోవాలంటే ఆ ఇంట్లో పిల్లల చదువుల ద్వారానే పోతుందనేది జగన్ గారు గట్టిగా నమ్ముతారు. – అందుకే ఆయన చదువు మీద దృష్టి పెట్టి నాణ్యమైన చదువును అందిస్తున్నారు. – అందుకే ఇప్పటి వరకూ విద్యపై జగన్ గారు రూ.73వేల కోట్లు ఖర్చు చేశారు. – నిజాయితీగా గత ఐదేళ్లలో నేనేం చేశానో మళ్లీ అదే చేస్తాను అని జగన్ చెప్తున్నాడు. దానికి ఎంత గుండె ధైర్యం కావాలి? – మోసం చేయడానికి ధైర్యం అవసరం లేదు. ఏ వెదవైనా మోసం చేయగలడు. – అమ్మ ఒడి గతంలో కంటే నేను రెండు వేలు పెంచగలను అని చెప్తున్నాడు. చెప్తే నిజాయితీగా అమలు చేయాలి కదా? *మోసం చేయడం కంటే చచ్చిపోవడం మేలన్నారు జగన్..!:* – పింఛన్ రూ.3,500 ఒకే సారి చెప్పు అంటే లేదంటే లేదన్నాడు జగన్. – దమ్ముగా నేను రూ.3,500 వేలే ఇవ్వగలను. అది కూడా రెండు విడుతల్లో పెంచుతాను అని ఖచ్చితంగా చెప్పాడు. – మోసం చేసే మాటలు చెప్పడం కంటే చచ్చిపోవడం మేలన్నాడు. అలాంటి మోసపు మాటలు నేను చెప్పను అన్నాడు. – అలా చెస్తే ప్రజలు నమ్మకం పెంచుకుంటారు. జగన్ చెప్తే చేస్తాడని ఆశలు పెంచుకుంటారు. అలా మోసం చేయలేను అన్నాడు. – ఈ రాష్ట్రంలో 80 శాతం కుటుంబాలకు మేలు జరిగేలా నేను పరిపాలన చేశానని జగన్ గారు చెప్తున్నారు. – మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని కూడా దమ్ముగా చెప్తున్న నాయకుడు వైఎస్ జగన్. – చంద్రబాబుకు అలాంటి ధైర్యం ఉందా? 2014–19లో తానే పరిపాలన చేశాడో అదే పరిపాలన తెస్తానని చెప్పే ధైర్యం, దమ్ము ఉందా? – 2014–19 మధ్య ప్రజలు మీకు అధికారం ఇస్తే మేం దిక్కుమాలిన పరిపాలన చేశాం అని మీ నోటితో మీరే సాక్ష్యం చెప్తున్నారు. – 2014లో కోటి పేద, మద్యతరగతి కుటుంబాలున్నాయి. ఇంటికో ఉద్యోగం అన్నాడు..లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు. – ఎంత మందికి ఇచ్చారు..కోటి ఉద్యోగాలు ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అయినా ఇచ్చాడా? – నీ కొడుకు లోకేశ్‌కు ఉద్యోగం ఇచ్చుకున్నావు తప్ప ఎవరికి ఇచ్చావ్? – మళ్లీ ఇప్పుడు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాను..లేదంటే 3వేల ని