సత్తెనపల్లి: రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్ బూత్‌లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగులకొట్టాలనే ఉద్దేశంలో దాడులు కూడా జరిగాయని, ముఖ్యంగా పలనాడు, అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగిందని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పలనాడు, అనంతపురం జిల్లాల్లో ఉన్న ఎస్సీలను ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చిందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబు వదిన పురందేశ్వరి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం వల్లేనన్నారు. రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లడానికి ప్రధాన కారణం చంద్రబాబు, పురందేశ్వరీల కుట్రేనని అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అధికారుల్ని మార్చినచోటే ప్రజ్వరిల్లిన హింస ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే, ఎక్కడైతే అధికారులను మార్చాలని పురందేశ్వరి అడిగారో.. అక్కడ మార్చారో.. సరిగ్గా అక్కడ్నే హింస ప్రజ్వరిల్లింది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి.ఉదాహరణకు పలనాడు జిల్లాను తీసుకుంటే.. నేను ఇప్పటికి మూడోసారి కంటెస్ట్ చేశాను. గతంలో రెండుమార్లు ఎన్నికలు చేశాము. ఏరోజూ కూడా ఈసారి జరిగినంత పెద్ద ఎత్తున హింస జరగలేదు. నిన్నటి ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది. ఐపీఎస్‌ల మార్పుచేర్పుల మీదే అసలైన కుట్ర జరిగింది కారణాలు ఏంటి..? అంత హింస ఎందుకు జరిగింది..? కొత్తగా అక్కడకు ఎస్పీ వచ్చారు కదా..? పాత ఎస్పీ పక్షపాతధోరణితో ఉండాడని మార్చేశారు. మరి, కొత్త ఎస్పీ వస్తే ఎన్నికలు బలంగా.. ప్రశాంతంగా జరగాలి కదా..? ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగిందనేది ఇక్కడ ప్రధాన పాయింట్..? అంటే, ఈ మార్పులు చేర్పుల మీదనే అసలైన కుట్ర జరిగింది. హింసకు కారకులు, కుట్రదారులు చంద్రబాబు, పురందేశ్వరి తెలుగుదేశం తరఫున చంద్రబాబు, భారతీయ జనతాపార్టీ తరఫున పురందేశ్వరి, జనసేన పవన్‌కళ్యాణ్ కలిసి ఈ కుట్ర చేశారా..? కుట్రలు చేసి ఎన్నికల కమిషన్‌కు పనిగట్టుకుని ఫిర్యాదులిచ్చి ఐపీఎస్‌లను మార్పులు చేర్పులు చేసి తమ తప్పుడు ఓట్లను వేయించుకోవాలనే గందరగోళంలోనే ఇంత హింస జరిగిందా..? ఎంతకైనా బరితెగించి ఎన్నికల్లో గెలవాలని అనుకున్నారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. అపాయింట్ చేసినోళ్లనే సస్పెండ్ చేయడం విడ్డూరకరం ముఖ్యంగా పలనాడులో నరసరావుపేట నియోకవర్గం ఆది నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటిది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కిందటి సారి ఎన్నికల్లో ఏడు స్థానాలకు ఏడు గెలిచాం. ఈసారి కూడా ఏడుకు ఏడింటినీ కైవసం చేసుకునే ఆస్కారం ఉంది. కాబట్టి, ఈ వాతావరణమంతా నలిపేయాలనే కుట్రతో ఇంత హింసకు పాల్పడ్డారని అనుమానం కలుగుతుంది. ఇక్కడ మరీ విచిత్రమేంటంటే.. ఎన్నికల కమిషన్ ఎవరినైతే ఐపీఎస్ అధికారులను అప్పాయింట్ చేసిందో.. వాళ్లను సస్పెండ్ చేసిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితిని చరిత్రలో ముందెన్నడూ నేను కూడా చూడలేదు. ఎన్నికల కమిషన్ అంతకు ముందున్న ఐపీఎస్ అధికారులు పక్షపాతధోరణితో పనిచేస్తారేమోననే అనుమానంతో.. మంచి చరిత్ర గల ఆఫీసర్లను వారి స్థానాల్లోకి తెచ్చి పాతవాళ్లను పంపించారు. తీరా చివరికి, కొత్తగా వచ్చిన వాళ్లు విధినిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి వారిని సస్పెండ్ చేశారు. కేవలం బదిలీ కూడా కాదు. ఏకంగా సస్పెండ్ చేశారంటే ఇదెంత విచిత్రమో అందరూ గమనించాలి. ఓడిపోతాననుకున్నప్పుడల్లా చంద్రబాబు రాక్షసుడవుతాడు ఇలాంటి పరిస్థితిని భారత ప్రజాస్వామ్యంలో ఏ విధంగా భావించాలి..? దీనికి వెనుక ప్రధాన కుట్ర చంద్రబాబుదే.. ఎందుకంటే, నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాక్షసంగా క్రూరంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అని అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపజేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడి చరిత్ర. ఇవాళ పలనాడులో ప్రజ్వరిల్లిన హింసకు కారణం ఇదే చంద్రబాబు, ఇదే పురందేశ్వరి. వారితోపాటు ఇక్కడ మార్పులు చేర్పుల వల్లనే ఇంత పెద్ద ఎత్తున హింస జరిగింది. పలనాడులో అట్టర్‌ఫెయిల్యూర్ పోలీస్ వ్యవస్థ ఆశ్చర్యకరమైన సంగతేంటంటే.. పోలింగ్ రోజున తలలు పగిలి అలో లక్ష్మణా.. అంటూ అల్లాడిపోతుంటే, పోలీసులకు సమాచారం ఇస్తే.. వాళ్లు సంఘటనా స్థలాలకు రీచ్ కాలేకపోయారు. మాచర్ల, గురజాల, నరసరావు పేట, సత్తెనపల్లిలో కొన్నిచోట్ల తీవ్రంగా దాడులు జరుగుతున్నాయని చెప్పినా.. ఆయాచోట్లకు పోలీసులు చేరుకోలేకపోయారు. ఇరువర్గాలు కొట్టుకుని కొట్టుకుని అలసటతో వాళ్లే ఆగిపోయారు. అప్పటికే రెండు వర్గాల్లో చాలామందికి తలలు పగిలి రక్తం పారింది. ఇదీ పలనాడులో పరిస్థితి. నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఇంటి మీద టీడీపీ రౌడీమూకలు దాడి చేసి.. ఇంటెదుట కార్లు ధ్వంసం చేసి.. గోడలు దూకిమరీ ఇంటి అద్దాలు పగులకొట్టారు. అదేవిధంగా నాకు ఛీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా పనిచేసిన నా అల్లుడు వెళ్తే అతని కారు మొత్తం పగులకొట్టారు. కంప్లైంట్ చేస్తేనేమో పోలీసులు రారు. కేసు ఎఫ్‌ఐఆర్ కట్టారు. మరలా, దానికి కౌంటర్ కేసు కట్టాలని పోలీసులపై వత్తిళ్లు చేస్తున్నారు. మరీ, ఇంత దారుణంగా ఫెయిల్యూర్ అఫ్ ద పోలీసింగ్‌ను నేను చరిత్రలో చూడ్లేదు. ఎన్నికల సమయంలో పోలీసు యంత్రాంగం దారుణంగా ఫెయిల్యూర్ అయ్యింది. అవినీతి పోలీసుల్ని గుర్తించి వేటేయాలని సిట్‌ను కోరాం ఇంతటి హింస ఎలా జరిగిందనే దానిపై బ్రిజ్‌లాల్ నాయకత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ అధికారులొస్తే నరసరావుపేటలో నేనెళ్లి కలిశాను. దాడులు ప్రక్రియ ఎలా జరిగిందనే విషయంపై వారితో వివరంగా చెప్పాను. కొన్ని రుజువులు, ఆధారాలు నివేదిక రూపంలో సమర్పించాం. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో కిందిస్థాయి సిబ్బంది తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారు. ఇది పచ్చి వాస్తవం. వారంతా తెలుగుదేశం మనుషుల దగ్గర కొంత డబ్బులు తీసుకుని పచ్చచొక్కాలేసుకున్నట్లు వ్యవహరించారు. కన్నా లక్ష్మీనారాయణ దగ్గర.. వాళ్లబ్బాయి దగ్గర ఏఏ సీఐలు, ఎస్సైలు ఎంతెంత తీసుకున్నారో మాదగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. కొంత మంది పోలీసు అధికారులు సిన్సియర్‌గానే తెలుగుదేశం ఇచ్చే డబ్బుల్ని తోసిపుచ్చారని కూడా మాకు తెలుసు. కనుక, మేము సిట్ అధికారులను ఒకటే కోరుతున్నాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నేతల దగ్గర డబ్బులు తీసుకున్నారో.. వారి వివరాలు తెలుసుకునే అధికారం సిట్‌కు ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అలాంటి తప్పుడు అధికారులను కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సిట్‌ను మేము కోరుతున్నాం. తొండపి గ్రామంలో మైనార్టీల పరిస్థితిని సిట్ దృష్టికి తెచ్చాం నా సత్తెనపల్లి నియోజకవర్గంలోని తొండపి గ్రామం ఈరోజుకీ అనాథగా అలమటిస్తుంది. ఆ గ్రామంలో ఉన్న మైనార్టీలంతా ఇళ్లు వదిలి ఊరు దాటి అక్కడో ఇక్కడ్నో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ గ్రామంలో ముస్లీంల ఇళ్లు తగలేశారు. వాళ్ల బైకులు, బండ్లు మొత్తం తగులబెట్టారు. ఇదెంత దారుణం..? ఒక రక్షణ గలిగిన సొసైటీలో ఇప్పటికీ ఊళ్లు వదిలి పోయి.. తలదాచుకునే పరిస్థితి రావడం ఏంటి..? కనుక, సిట్ అధికారులను.. కొత్తగా వచ్చే ఎస్పీకి నేనొక మనవి చేస్తున్నాను. తొండపిలో శాంతిభద్రతలను కాపాడండి. ఎక్కడైతే, వాళ్లు ఇళ్లూవాకిళ్ళూ వదిలి తలదాచుకుంటున్నారో వారందర్నీ మరలా తెచ్చి వాళ్ల ఇళ్లల్లోకి చేర్చండని మనవి చేస్తున్నాను. ఎన్నికల కమిషన్, సిట్ న్యాయంగా వ్యవహరిస్తాయని భావిస్తున్నాం పోలీంగ్ బూత్‌లను తెలుగుదేశం రౌడీమూకలు పకడ్బందీ ప్రణాళికతోనే పోలీసులను అడ్డంపెట్టుకుని కైవసం చేసుకోవాలనే ప్రయత్నం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. రిగ్గింగ్‌లకూ పాల్పడ్డారు. మేము పర్టిక్యులర్‌గా బూత్ ¯ð ంబర్లతో సహా చెబుతూ.. రీ పోలింగ్ పెట్టాలని కోరాం. అయితే, రీ పోలింగ్ అవసరం లేదని ఎన్నికల కమిషన్ వారు చెబుతున్నారు. మరి, ఇంత దుర్మార్గానికి అసలు కారకులెవరో నిగ్గు తేల్చాలని సిట్‌ను, ఎన్నికల సంఘాన్ని మేము అడుగుతున్నాం. ఎవరైతే, అవినీతికి పాల్పడ్డారో, విధుల్లో అలసత్వం ప్రదర్శించారో వారందరిపైన వేటు వేయాల్సిన అవసరముంది. సిట్ ఆ దిశగా న్యాయం చేస్తోందని మేము భావిస్తున్నాం.