తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పరాకాష్టకు చేరిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జోనల్ ఇంచార్జ్‌లు మరియు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసంగించిన వైయస్ఆర్‌సీపీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి...ఏమన్నారంటే వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ రెడ్ బుక్ రాజ్యాంగంపై ముందుండి పోరాడుతోంది. వ్యవస్ధలను నిర్వీర్యం చేయడం, నిరంకుశ పాలన, నియంత పాలనను తెలుగుదేశం పార్టీ అమలుచేస్తుంది. నాడు జగన్ గారు వ్యవస్ధలను గాడిలో పెట్టి ప్రజలకు చక్కటి పాలన అందిస్తే ఇప్పటి టీడీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డుగా పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తూ వికృత పాలన అందిస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ వందల కొద్ది తప్పుడు కేసులు పెట్టి వైయస్ఆర్‌సీపీ శ్రేణులను వేధిస్తున్నారు. తాజాగా మన నాయకుడు జగన్ గారి పుట్టినరోజును ప్రజలంతా పండుగలా చేసుకున్నదానిని తట్టుకోలేక బరితెగించి నడిరోడ్డుపై నడిపిస్తున్నారు. అరాచకాలు జరిగిన చోట మాత్రం పోలీసుల జాడ ఉండదు కానీ జగన్ గారి పుట్టినరోజున కేక్ కట్ చేసి మేకలు, పొట్టేళ్ళు కోయడంపై కేసులు పెట్టి నడిరోడ్డుపై నడిపిస్తున్నారు, మరి బాలకృష్ణ సినిమాకు పొట్టేళ్ళ తలలతో హారం వేసి చేసినప్పుడు మాత్రం ఎలాంటి కేసులు ఉండవు. ఇదెక్కడి న్యాయమో అర్ధం కావడం లేదు. పైగా సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏకంగా ఈ మధ్య ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా, కమ్యూనిస్ట్ నాయకుడు హక్కుల కోసం పోరాడితే పీడీ యాక్ట్ పెట్టారు. పైగా డీజీపీ రోడ్లపై నడిపించడానిని సమర్ధిస్తూ మాట్లాడడం చూశాం. ఇలాంటి విపరీతమైన పోకడలతో టెర్రరైజ్ చేయడమే లక్ష్యంగా చేస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలు గాలికొదిలేసి ఇలా బరితెగించి వ్యవహరిస్తున్నారు. మెడికల్ కాలేజీలపై మన ఆందోళన ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజలంతా ఏడాదిన్నరలోనే విసిగిపోయారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమి ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేయడానికి సిద్దమయ్యారు. జగన్ గారు మరింత పట్టుదలతో పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ప్రతి ప్రజాసమస్యపై ముందుండి పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కూటమి ప్రభుత్వ దమనకాండను మనం ధీటుగా ఎదుర్కొందాం. వైయస్ఆర్‌సీపీ సైన్యం పోరాటపటిమతో దూసుకెళుతుంది. వైయస్ఆర్‌సీపీ న్యాయ విభాగం చక్కగా పనిచేసి అందరికీ న్యాయం అందేలా చేయడం గొప్ప విషయం, జగన్ గారు కూడా ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ లీగల్ సెల్ లో ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కోవడం అభినందించదగ్గది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ సేవలు అమూల్యం. మీ పోరాటం నిరంతర ప్రక్రియలా మారింది, రానురాను మరింతగా వైయస్ఆర్‌సీపీనాయకులు, కార్యకర్తలను వేధించే ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొందాం. లీగల్ సెల్ కు అవసరమైన సహాయ సహకారాలు పార్టీ నుంచి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను రోడ్లపై నడిపించడంపై లీగల్ సెల్ మరింతగా అప్రమత్తమవ్వాలి. పోలీసులు చేస్తున్నది తప్పు అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అన్యాయాన్ని ధీటుగా ఎదుర్కొందాం. దారుణంగా కొట్టి రోడ్లపై నడిపించడం ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉంటుందా. లీగల్ సెల్ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి. రానున్న రోజుల్లో లీగల్ సెల్ కు మరింత పని ఉంటుంది. లీగల్ సెల్ కమిటీలు కూడా ఉత్సాహంగా పనిచేసేలా ఉండాలి. అలాంటివారిని గుర్తించి అవకాశం కల్పిద్దాం. అవసరమైతే ప్రత్యేక యాప్ సిద్దం చేసి ఎప్పటికప్పుడు సమాచారం డిజిటలైజ్ చేయడం వల్ల భవిష్యత్ లో ఉపయోగించుకోవచ్చు. చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేద్దాం. వైయస్ఆర్‌సీపీ క్యాడర్‌కు అండగా నిలుద్దాం. ఈ సమావేశంలో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎమర్జెన్సీకి మించి దారుణమైన పాలన సాగుతోంది. దీనికి వంతపాడుతున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేద్దాం. అన్యాయంగా మన కార్యకర్తలను వేధిస్తున్న వారికి మనం అండగా నిలుద్దాం అన్నారు. పార్టీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ క్యాడర్‌ను అతి కిరాతకంగా వేధిస్తున్నారు, రకరకాల తప్పుడు కేసులు పెడుతున్నారు. మన లీగల్ సెల్ వారికి అండగా నిలుస్తుంది. పార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ లీగల్ సెల్ కమిటీలు వెంటనే నియమించుకుని ముందుకెళ్ళాలన్నారు. వైయస్ఆర్‌సీపీ క్యాడర్‌కు పూర్తిగా న్యాయసహాయం అందించేందుకు సిద్దంగా ఉందామన్నారు. వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ పార్టీకి వెన్నెముకలాగా పనిచేస్తుందని మన నాయకుడు జగన్ గారు చెబుతూనే ఉన్నారు, మనమంతా మరింత చురుగ్గా పనిచేసి మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుందాం.