రాజానగరం జనసేన మాజీ ఇన్‌ఛార్జ్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

పార్టీ అధినేత, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన మేడా గురుదత్త ప్రసాద్‌

తాడేప‌ల్లి:  జ‌న‌సేన పార్టీకి వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆ పార్టీ కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌గా తాజాగా రాజాన‌గ‌రం  రాజానగరం జనసేన మాజీ ఇన్‌ఛార్జ్ మేడా గురుద‌త్త ప్ర‌సాద్ వైయ‌స్ఆర్‌సీపీ గూటికి చేరారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో పార్టీ అధినేత‌, సీఎం వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో మేడా గురుద‌త్త ప్ర‌సాద్ వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

గురుదత్త ప్రసాద్‌తో పాటు జనసేన స్ధానిక నాయకులు మండపాక శ్రీను, అడబాల సత్యనారాయణ, వడ్డి చిన్నా, నాగవరపు భానుశంకర్, వల్లేపల్లి రాజేష్, చొంగా మణికంఠ, త‌దిత‌రులు  సీఎం సమక్షంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

కార్యక్రమంలో సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు.

Back to Top