ఏప్రిల్‌ 1 నుంచి ఫైన్‌ క్వాలిటీ బియ్యం సరఫరా

పౌరసరఫరాల శాఖ సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ లబ్ధిదారులకు ఫైన్‌ క్వాలిటీ బియ్యం సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సివిల్‌ సప్లయిస్‌ కమిషన్‌ కోన శశిధర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకులం జిల్లాలో ఫైన్‌ క్వాలిటీ బియ్యం సరఫరాపై సీఎం ఆరా తీశారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో ఫైన్‌ క్వాలిటీ బియ్యం సరఫరా చేసేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ 1 నుంచి కొత్త రేషన్‌ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top