బ్ల‌డ్ క్యాన్స‌ర్ బాధితుడికి రూ. ల‌క్ష ఆర్థిక సాయం

శార‌దాపీఠం వ‌ద్ద ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ని క‌లిసిన బాధిత కుటుంబీకులు

విశాఖ‌ప‌ట్నం: రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు బ్ల‌డ్ క్యాన్స‌ర్ బాధితుడు సాలాపు లీలాధ‌ర్ నాయుడు(10)కు జిల్లా యంత్రాంగం రూ.1 ల‌క్ష ఆర్థిక సాయం స‌మ‌కూర్చింది. సంబంధిత చెక్కును పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు, జీవీఎంసీ ఏడీసీ స‌న్యాసిరావులు బాధిత కుటుంబానికి అంద‌జేశారు. చిన‌ముషిడివాడ‌లోని శ్రీ శార‌దా పీఠంలో పూజ‌ల నిమిత్తం బుధ‌వారం న‌గ‌రానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ని న‌గ‌రానికి చెందిన బ్ల‌డ్ క్యాన్స‌ర్ బాధితుడు సాలాపు లీలాధ‌ర్ నాయుడు(10) త‌న త‌ల్లిదండ్రులు నూక‌రాజు, స‌త్య‌క‌ళ‌తో పాటు వ‌చ్చి క‌లిశారు. స‌మ‌స్య‌ను సానుకూలంగా విన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.1 ల‌క్ష ఆర్థిక మంజూరు సాయం చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున‌ చెక్కును సిద్ధం చేయ‌గా స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు, ఇత‌ర అధికారుల చేతుల మీదుగా అందజేశారు.

Back to Top