కోవిడ్‌ సంక్షోభంలో పారిశ్రామికరంగాన్ని ఆదుకున్నాం

ఇన్సెంటీవ్‌ రూపంలో రూ.2773 కోట్లు అందించాం

గత ప్రభుత్వం ఐదేళ్లలో ఇచ్చిన ఇండస్ట్రీయల్‌ ఇన్సెంటీవ్స్‌ రూ.773.42 కోట్లు మాత్రమే 

అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అసెంబ్లీ: కరోనా సంక్షోభంలోనూ పారిశ్రామిక రంగానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. పెద్ద, భారీ పరిశ్రమల కంటే పది రెట్లు ఎంఎస్‌ఎంఈ రంగంలోనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం అందించిన తోడ్పాటును మంత్రి వివరించారు. ప్రభుత్వం తీసుకున్న కొత్త పాలసీ ప్రకారం.. విద్యుత్‌ ధర ఐదు సంవత్సరాల పాటు రూపాయి రీయింబర్స్‌మెంట్, ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ వందశాతం, పెట్టుబడి 15 శాతం లేదా రూ.20 లక్షలు, ఇంట్రస్ట్‌ సబ్సిడీ ఐదు సంవత్సరాల పాటు 3 శాతం, నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ 25 శాతం, పరిశ్రమ పెట్టేందుకు భూమి కొనుగోలు చేసేవారికి స్టాంపు లేదా ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ వంద శాతం మినహాయింపు, లీజుకు, మార్టిగేజ్, షెడ్‌ తీసుకున్నా 100 శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు వర్తింపజేశామన్నారు. 

ఎంఎస్‌ఎంఈ రంగానికి పెండింగ్‌ ఇన్సెంటీవ్స్‌ రూ.1330 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. పెద్ద, భారీ పరిశ్రమలకు రూ.381 కోట్లు, టైక్స్‌టైల్‌ యూనిట్స్‌కు పవర్‌ అడ్జస్ట్‌మెంట్‌కు రూ.865 కోట్లు, ఫెరోయ్స్‌ యూనిట్స్‌ ఇబ్బందుల్లో ఉంటే రూ.196.88 కోట్లు.. మొత్తం కలిపి రూ.2773 కోట్లు కేవలం ఇన్సెంటీవ్‌ రూపంలో ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఇన్సెంటీవ్‌ పెండింగ్స్‌ రూ.3,446 కోట్లు పెట్టివెళ్లిందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రూ.2773 కోట్లు చెల్లించిందన్నారు.  

గత ప్రభుత్వం 2014–19 వరకు ఐదు సంవత్సరాలు మొత్తం ఇండస్ట్రీయల్‌ ఇన్సెంటీవ్స్‌ రూ.773.42 కోట్లు అయితే.. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు సంవత్సరాలకు సగటున తీసుకున్నా.. రూ.1,010 కోట్లు విడుదల చేశామని గర్వంగా చెబుతున్నానన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే పారిశ్రామిక ప్రగతి జరిగినట్టు, పరిశ్రమలు స్థాపించినట్టు టీడీపీ వారు చెప్పుకుంటున్నారన్నారు. చెప్పుకుంటున్నారు. ఎక్స్‌పోర్ట్స్‌ ఒక్క అంశం తీసుకున్నా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలో 7వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎదిగిందని చెప్పారు.  

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం వైయస్‌ జగన్‌ సూచనలతో రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా పరిశ్రమల పట్ల, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈల పట్ల చాలా చిత్తశుద్ధితో ముందుకువెళ్తుందన్నారు. రాబోయే రోజుల్లో అగ్రస్థానానికి చేరేందుకు కృషిచేస్తామన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top