వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్‌ 

చిలుకలూరిపేట టీడీపీ నేత మల్లెల రాజేష్‌నాయుడు చేరిక

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్‌ ఇవాళ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. అలాగు గుంటూరు జిల్లా చిలకలూరిపేట టీడీపీ నేత మల్లెల రాజేష్‌నాయుడు, ఆయన అనుచరులు  వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి వైయస్‌ జగన్‌ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్‌ఆర్‌సీపీని గెలిపించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
 

Back to Top